శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జులై 2018 (13:23 IST)

ఆ పని చేసి పారిపోతే పాస్‌పోర్టులు రద్దు : ఎన్నారై భర్తలకు వార్నింగ్

ప్రవాస భారతీయ భర్తలకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. భార్యలను వదిలివేసి దేశం విడిచి పారిపోతే పాస్‌పోర్టులను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇందులోభాగంగా తొలిగా 8 మంది ఎన్నారై భర్తల పాస్‌పోస్టులను రద్ద

ప్రవాస భారతీయ భర్తలకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. భార్యలను వదిలివేసి దేశం విడిచి పారిపోతే పాస్‌పోర్టులను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇందులోభాగంగా తొలిగా 8 మంది ఎన్నారై భర్తల పాస్‌పోస్టులను రద్దు చేసింది. అలాగే, మరికొందరికి లుకౌట్ నోటీసులు జారీచేసింది.
 
ఇటీవలి కాలంలో భార్యలను మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా భార్యలను మోసగించి పారిపోయే ఎన్నారైలపై ఓ కన్నేసి ఉంచడానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, హోంశాఖ, విదేశాంగ శాఖ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. గడిచిన 2 నెలల్లోనే ఈ కమిటీకి 70 ఫిర్యాదులందాయి. 
 
వాటిని పరిశీలించిన మీదట 8 మంది ఎన్నారైల పాస్‌పోర్టులు రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. కాగా, ఎన్నారైల వివాహాలను వెంటనే రిజిస్టర్‌ చేసే విధంగా అన్ని రాష్ట్రాలు రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలు ఇవ్వాలని కేంద్రమంత్రి మేనక గాంధీ సూచించారు. ఎన్నారైలు ఏడురోజుల్లో తమ వివాహాన్ని రిజిస్టర్‌ చేసుకోని పక్షంలో వారికి పాస్‌పోర్టులు, వీసాలు ఇచ్చేది లేదని ఆమె స్పష్టంచేశారు.