బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (16:25 IST)

ట్రాన్స్‌పరెంట్ దుస్తులతో ధోనీ భార్య సాక్షి... చూడలేక ఛస్తున్నామంటున్న నెటిజన్స్

ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించే సెలెబ్రిటీల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వ్యక్తిగత ఫోటోలు షేర్ చేయడం ద్వారా సెలెబ్రిటీలు బాగానే సంపాదిస్తున్నారు. సినీ ప్రముఖులు, క్రీడాకారులు ప్రస

ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించే సెలెబ్రిటీల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వ్యక్తిగత ఫోటోలు షేర్ చేయడం ద్వారా సెలెబ్రిటీలు బాగానే సంపాదిస్తున్నారు. సినీ ప్రముఖులు, క్రీడాకారులు ప్రస్తుతం సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా సంపాదించే వారిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకరు. 
 
ప్రస్తుతం ఈ విషయాన్ని పక్కనబెడితే.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ ప్రస్తుతం నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలే కారణం. విషయానికొస్తే.. ఇటీవల సాక్షి ధోనీ ఓ సంగీత్ ఫంక్షన్‌కు హాజరైంది. ఆ ఫంక్షన్‌లో సాక్షి ధరించిన లెహంగా ప్రస్తుతం నెటిజన్ల కోపానికి కారణమైంది. ఆ లెహంగా ఆమెకు అంతగా నప్పలేదని సాక్షి ధోనీ ఫోటోను ట్రోల్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ధోనీ సతీమణిగా ఆమెకు ఆ లెహంగా సూట్ కాలేదని, ఆమె గౌరవప్రదంగా దుస్తులు ధరిస్తే బాగుండునని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ డ్రెస్‌లో ఆమె అందంగా కనిపించినా.. ఆమె ధరించిన బ్లౌజ్ సరిగ్గా కుదరలేదని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు. అంతేగాకుండా ధోనీ ఎందుకు సాక్షిని ఇలాంటి డ్రెస్‌లు ధరించేలా చేస్తున్నాడని, జెంటిల్, ఫరెఫెక్ట్ మ్యాన్ అయిన ధోనీ.. ఆయనలా సాక్షిని వుండేలా చేయాలని కొందరు హితవు పలికారు. 
 
సాక్షి మేడమ్.. ఆ లెహంగా మీకు సూట్ కాలేదు. మీరు గౌరవప్రదంగా కనిపిస్తే బాగుంటుంది. మీరు సాధారణ మహిళ కాదని.. ఓ కెప్టెన్‌కు భార్య అనేది గుర్తుంచుకోవాలని మరో నెటిజన్ సూచించాడు. మరికొందరైతే.. సాక్షి ఇలాంటి దుస్తులు ధరించడం పక్కనబెడితే బాగుంటుందని, ధోనీ పేరు చెడపకుండా వుంటే మరీ బాగుంటుందని అంటున్నారు. 
 
కానీ చాలామంది సాక్షికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే 2 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న సాక్షి ధోనీ.. లెహంగాలో అదిరిపోయిందని.. ఆ డ్రెస్‌లో ఆమె లుక్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ లెహంగాలో వున్న తప్పేంటని అడుగుతున్నారు. మరి సాక్షి ధోనీ లెహంగాపై చర్చ ఏ వివాదానికి దారి తీస్తుందో వేచి చూడాలి.