సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:02 IST)

ఆంధ్రలో ఎన్నికల సంఘం-రాష్ట్ర ప్రభుత్వం ఒకే మాటపై నిలబడితే... ద్యావుడా...

శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది తెలిసిందే. నిన్నటి మిత్రులు రేపటికి శత్రువులు కావొచ్చు. నిన్నటి శత్రువులు రేపటికి మిత్రులు కావచ్చు. అలాంటిదే ఆంధ్రాలో జరుగుతోంది.
 
నిన్నటివరకు ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నేడు మాత్రం ఒకే మాటపై నిలబడ్డారు. మున్సిపల్ ఎన్నికలకు ఫ్రెష్‌గా నోటిఫికేషన్ ఇవ్వాలని కోర్టులో దాఖలపై వ్యాజ్యంలో రాష్ట్రప్రభుత్వం, ఎన్నికల సంఘం ఒకే మాటపై నిలబడి ప్రత్యర్థి వ్యాజ్యం చెల్లదంటూ వాదనలు వినిపించాయి.
 
నిన్నటివరకు ప్రత్యర్థులుగా వాదించుకున్న ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అశ్వినీ కుమార్‌లు నేడు ఒకటిగా నిలబడి వాదిస్తుంటే ప్రత్యర్థుల గొంతులు మూగబోయాయట. న్యాయమూర్తులే అవాక్కయ్యారట.