శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (18:40 IST)

అది బీరు గ్లాసా..? వైన్ గ్లాసా? స్కాచ్ గ్లాసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గాజు గ్లాజుపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. జనసేనకు గాజు గ్లాసును ఇవ్వడంపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. 
 
"అరె జనసేన పార్టీ గుర్తు గలాసు అంటగా అని ప్రశ్నించింది. అది బీరు గ్లాసా..? వైన్ గ్లాసా? స్కాచ్ గ్లాసా?" పనిలో పనిగా నాగబాబు గారికి కూడా ఓ గ్లాస్ ఇవ్వండర్రా.. అసలు రీసెంట్‌గా కొత్త గొంతు వచ్చిన అందంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదంటూ రాసుకొచ్చింది. 
 
అయితే శ్రీ రెడ్డి కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతేగాకుండా పీకే ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేనపై, జనసేనానిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. గతంలో పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.