గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:54 IST)

లారెన్స్ ఇంటికెళ్లాను.. మంచి ఆఫర్ ఇచ్చాడు.. శ్రీరెడ్డి శుభవార్త

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తూ వార్తల్లోకి వచ్చిన శ్రీరెడ్డికి.. ప్రస్తుతం లారెన్సే అవకాశం ఇచ్చాడట. లారెన్స్ నిర్మించబోతున్న ఓ సినిమాలో శ్రీరెడ్డికి అవకాశం వచ్చిందట.

తమిళ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి చేస్తున్న వాఖ్యలు మీడియాలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. సినిమా అవకాశం ఇస్తానని చెప్పి నన్ను శారీరకంగా వాడుకున్నాడని ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్‌పై శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని రాఘవ లారెన్స్ కొట్టిపారేశాడు. 
 
ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తూ వార్తల్లోకి వచ్చిన శ్రీరెడ్డికి.. ప్రస్తుతం లారెన్సే అవకాశం ఇచ్చాడట. లారెన్స్ నిర్మించబోతున్న ఓ సినిమాలో శ్రీరెడ్డికి అవకాశం వచ్చిందట. ఈ విషయాన్ని శ్రీరెడ్డి స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.
 
"నా స్నేహితులందరికీ, అభిమానులకు శుభవార్త. లారెన్స్‌ను ఆయన నివాసంలో కలిశాను. ఆయన నాకు మంచి గౌరవాన్నిచ్చారు. అక్కడ చాలామంది పిల్లలున్నారు. వారంతా లారెన్స్‌తో సంతోషంగా ఉన్నారు. నా కోసం ప్రార్థించారు కూడా. నేను ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. తన తదుపరి చిత్రంలో తీసుకుంటున్నానని హామీ ఇచ్చిన లారెన్స్, మంచి పాత్రను ఆఫర్ చేస్తానన్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ డబ్బును నేను తిత్లీ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను" అని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. 
 
అయితే లారెన్స్‌ని తాను కలిసినప్పుడు తన ప్రైవేట్ భాగాలని ముట్టుకున్నాడని శ్రీరెడ్డి తీవ్రమైన విమర్శలు గుప్పించింది. మంచి తనం ముసుగులో లారెన్స్ ఇలాంటి పనులు చేస్తున్నారని శ్రీరెడ్డి గతంలో ఆరోపించింది. ఇంత రచ్చ చేసి శ్రీరెడ్డి ప్రస్తుతం లారెన్స్ సినిమాలోనే అవకాశం కొట్టేయడంపై నెటిజన్లు విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.