బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (11:35 IST)

మిస్టర్ విశాల్ రెడ్డి.. నువ్ ఎలాంటి తప్పులు చేశావో?: శ్రీరెడ్డి

దర్శకుడు తేజ వంతు పూర్తైంది. ప్రస్తుతం హీరోను శ్రీరెడ్డి టార్గెట్ చేసింది. ఆయన ఎవరో కాదు.. పందెం కోడి హీరో విశాల్. వారం రోజుల్లో నడిగర్ సంఘం ఎన్నికలు జరుగనుండగా.. బరిలో ఉన్న విశాల్, శరత్ కుమార్ ప్యానల్స్ మధ్య ఇప్పటికే విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుండగా, తాజాగా, శ్రీరెడ్డి కూడా విమర్శలు మొదలెట్టింది. 
 
కారణం ఏమీ లేకపోయినా.. తన ఫేస్‌బుక్‌లో విశాల్‌ను ఏకిపారేసింది. ఆయనపై పలురకాలుగా విమర్శించింది. టాలీవుడ్‌లో కేస్టింగ్ కౌచ్ భూతాన్ని ప్రపంచానికి తెలియజెప్పి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి, హైదరాబాద్‌ను వదిలి, ప్రస్తుతం చెన్నైలో మకాం వేసిన సంగతి తెలిసిందే. 
 
చెన్నైలోనూ, ఏఆర్‌ మురుగదాస్, లారెన్స్‌ వంటి ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి, తాజాగా విశాల్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించింది. తాజాగా విశాల్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించింది. 
 
''మిస్టర్ విశాల్ రెడ్డి.. నువ్ ఎలాంటి తప్పులు చేశావో నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి?? ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెమ్ వేనుమా?? ఇప్పిడి??’ అంటూ అతని పాపులర్ సాంగ్‌ను మిక్స్ చేస్తూ ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.