ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శనివారం, 15 జూన్ 2019 (16:16 IST)

తేజకి ఇలియానాతో ఎఫైర్... బాంబు పేల్చిన శ్రీరెడ్డి, ఉలిక్కిపడిన టాలీవుడ్

చెన్నైలో తిష్టవేసిన శ్రీరెడ్డి మరోసారి టాలీవుడ్ సెలబ్రిటీలపై ఆరోపణాస్త్రాలు సంధించడం మొదలెట్టింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజిలో వున్నదని వ్యాఖ్యానిస్తూ వస్తున్న శ్రీరెడ్డి ఈసారి దర్శకుడు తేజపై తీవ్ర ఆరోపణలు చేసింది. తేజకి ఇలియానాతో ఎఫైర్ వుందంటూ షాకింగ్ కామెంట్లు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడేట్లు చేసింది. 
 
అంతేకాదు... ఇంకా దానికి కొనసాగింపుగా... 'తేజ.. చాలా రోజుల క్రితం మిర్రర్ విజయ లక్ష్మి ఫ్రెండ్ ఒక నర్స్‌ని ప్రేమ దోమ అని చెప్పి బాగా వాడేసి వదిలేసావ్.. గుర్తు ఉందా..?' అంటూ వ్యాఖ్యానించింది. కాగా ఇటీవలే విడుదలైన సీత చిత్రం ప్రమోషన్లో దర్శకుడు తేజ మాట్లాడుతూ... శ్రీరెడ్డి లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఇండస్ట్రీని ఏం చేయలేరని అన్నారు. దీనికి ప్రతిగా శ్రీరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసింది.