గురువారం, 3 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 2 ఏప్రియల్ 2025 (18:12 IST)

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

Stray dogs scared of AI-powered robot dog
ఆ రోబో కుక్కను చూసి వీధి కుక్కలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. అచ్చం వీధికుక్కలానే రోబో అటుఇటూ తిరుగుతూ వుండటంతో దాని కదలికలను చూసి కుక్కలు మొరగడం ప్రారంభించాయి. IIT కాన్పూర్‌లోని టెక్‌క్రితిలో, వీధికుక్కలు ముక్స్ రోబోటిక్స్‌కు చెందిన రోబోటిక్ కుక్కను కలిసిన వీడియో వైరల్ అయింది. AI-ఆధారిత రోబోట్ కుక్క నిజమైన కుక్కల కదలికలను అనుకరిస్తూ వాటికి చుక్కలు చూపిస్తోంది.
 
ఓ వీధి కుక్క తొలుత దానిని వాసన చూస్తూ దాని చుట్టూ తిరుగుతోంది. ఇంతలోనే మరిన్ని క్యాంపస్ కుక్కలు అక్కడికి చేరాయి. తమ ముందు వున్న ఆ వింత ఆకారం చుట్టూ తిరుగుతున్నాయి. డాక్టర్ ముఖేష్ బంగర్ ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ఈ క్లిప్ ప్రకృతి- సాంకేతికతల మిశ్రమంతో వీక్షకులను ఆకర్షించింది.