గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 డిశెంబరు 2020 (14:17 IST)

హనీమూన్‌కి తీసుకెళ్లి నా ఫ్రెండుతో పడుకో అన్నాడు: నటి కరిష్మా కపూర్

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ 90వ దశకంలో ఓ ఊపు ఊపిన స్టార్. హిందీ పరిశ్రమలో ప్రసిద్ధ నటులలో ఒకరైన ఆమె కూలీ నెంబర్ 1, రాజా హిందుస్తానీ, దిల్ తో పాగల్ హై, ఫిజా వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె సినీ జీవితం సూపర్ సక్సెస్ అయితే, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడుదుడుకులకు గురైంది. వ్యాపారవేత్త సుంజయ్ కపూర్‌తో వివాహం విడాకులకు దారి తీసింది.
 
13 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎంతో గందరగోళం అనుభవించిందామె. న్యాయ పోరాటం తర్వాత 2016లో వారిద్దరూ చట్టబద్ధంగా విడిపోయారు. తన వ్యక్తిగత జీవితం గురించి నటి ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను చెప్పింది. తన భర్త తనను హనీమూన్‌కి తీసుకెళ్లి అతడి ఫ్రెండుతో పడుకోమన్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పింది.
 
తన మాజీ స్నేహితుడికి తన ధరను కోట్ చేసి అతడితో పడుకోవాలని హనీమూన్ వెళ్లిన సమయంలో తన మాజీభర్త ఒత్తిడి చేసాడని తెలిపింది. అందుకు తను నిరాకరించడంతో తనను కొట్టాడని వివరించింది. అంతేకాదు... తనకు గిఫ్టుగా ఇచ్చిన దుస్తులను వేసుకోలేదని తన అత్తగారు సైతం తనపై భౌతిక దాడులు చేసారంటూ ఆవేదన వ్యక్తం చేసింది కరిష్మా కపూర్.