గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 డిశెంబరు 2020 (12:52 IST)

వివాహేతర సంబంధం: భర్త కాళ్లు పట్టుకున్న భార్య, ప్రియుడు పీకనొక్కేశాడు

వివాహేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలిగొంది. కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ ఇల్లాలు. ప్రియుడితో ఆ దారుణం చేయించింది. భర్త కాళ్లను గట్టిగా పట్టుకున్న ఆమె తన భర్త గొంతు పిసికేయాలని ప్రియుడిని పురమాయించింది. అతడు తన ప్రియురాలు చెప్పినట్లే ఆమె భర్త గొంతు నొక్కి హతమార్చాడు.
 
వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన 45 ఏళ్ల శ్రీనివాసరావు తన భార్య సైదాలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సైదాకు ఏడాదిన్నర క్రితం వెంకటరెడ్డి అనే ఆటోడ్రైవరుతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త సైదాను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు.
 
ఈ విషయమై అనేకసార్లు ఇంట్లో గొడవపడ్డారు. ఈ క్రమంలో క్రిస్మస్ రోజున భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అతడు పూటుగా మద్యం సేవించి వుండటంతో సైదాలక్ష్మి తన పథకాన్ని ప్రియుడికి చెప్పింది. భర్త అడ్డు తొలగించుకుంటే హాయిగా ఎంజాయ్ చేయవచ్చని తెలిపింది. దాంతో భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య అతడి కాళ్లను గట్టిగా పట్టుకోగా, ప్రియుడు అతడి గొంతునొక్కి హతమార్చారు. ఆ తర్వాత అతడి మృతదేహానికి ఉరి వేసి ఫ్యానుకి వేలాడదీసారు. ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసారు. కానీ మృతుడు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయండంతో నిందితురాలు అసలు నిజం అంగీకరించింది.