శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (14:06 IST)

తమిళనాడు ఎన్నికలు: ఎడప్పాడి బాగానే చేశారుగా... వేసేద్దాం, ఎవరు?

తమిళనాడు ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరుగబోతున్నాయి. ఈసారి ఓటర్ల నాడి రాజకీయ పార్టీలకు కాస్త కన్ఫ్యూజ్ గా వున్నట్లు చెపుతున్నారు. వచ్చే ఎన్నికల అనంతరం స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ముందుగా అనుకున్నారు కానీ రానురాను ట్రెండ్ మారుతోందట.
 
ఇపుడు చాలామంది మహిళలు... అమ్మ జయ తర్వాత కుర్చీని ఎక్కిన ఎడప్పాడి పళనిస్వామి పాలన బాగానే వుందని అభిప్రాయపడుతున్నారట. మళ్లీ డీఎంకె ప్రభుత్వం ఎలా వుంటుందో ఏమో.. ఎడప్పాడి పళనిస్వామికే మళ్లీ ఓటు వేద్దామని మహిళా గ్రూపులు మాట్లాడుకుంటున్నట్లు లేటెస్ట్ న్యూస్. ఈ వార్తతో డిఎంకె శ్రేణులు బెంబేలెత్తిపోతున్నట్లు సమాచారం. 
 
ఒక్కసారిగా ట్రెండ్ ఇలా తిరగబడిందేమిటా అని యోచన చేస్తున్నారట. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవలే డిఎంకెకి చెందిన రాజా ఏకంగా సీఎం పళనిస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలపై కోర్టు కూడా కొరడా ఝుళిపించింది. తాజాగా స్టాలిన్ కుమారుడు కూడా భగ్గుమనే వ్యాఖ్యలు ఓటర్లను పునరాలోచించుకునేలా చేసిందని అంటున్నారు.
 
కాగా తమిళనాడు 16వ శాసనసభ ఎన్నికలు 2021 ఏప్రిల్ 6న జరగనున్నాయి. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఓట్లను లెక్కించే తేదీ మే 2. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తుది ఫలితాలు సాయంత్రానికి ప్రకటించబడతాయి. 
 
రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలు ఉన్నాయి.