గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 29 మే 2018 (15:50 IST)

కార్పొరేటర్లుగా గెలవలేని వారిని కూడా మంత్రులు, ఎమ్మెల్సీలుగా చేశాం : నారా లోకేశ్

విజయవాడ వేదికగ జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రసంగం ఆయన్ను నవ్వులపాలు చేసింది. కార్పొరేటర్లుగా గెలవలేనివారిని కూడా

విజయవాడ వేదికగ జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రసంగం ఆయన్ను నవ్వులపాలు చేసింది. కార్పొరేటర్లుగా గెలవలేనివారిని కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదేనంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సొంత పార్టీ నేతలతో పాటు.. విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, 'చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా నాన్న నన్ను ఊరికి పంపేవారు. అలా పంపేటప్పుడు.. 'పల్లెకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవచేసినట్లే..' అని పదేపదే గుర్తుచేసేవారు. ఆ విధంగా చిన్నవయసులోనే నాకు పంచాయితీరాజ్‌ మంత్రిగా పల్లెలకు సేవచేసే అవకాశం దక్కిందన్నారు. 
 
స్వాతంత్ర్యం తర్వాత 70 ఏళ్లలో చేయలేని పనులన్నీ గడిచిన 4 ఏళ్లలో పూర్తిచేశాం. మేము వేసిన సీసీ రోడ్ల మీద ప్రతిపక్ష నాయకులు నడుస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్న నాపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వాళ్లకు దమ్ము, ధైర్యం ఉంటే.. నేను ఎక్కడ, ఎలా తప్పు చేశానో ఆధారాలతో సహా నిరూపించాలి. తన సొంత నియోజకవర్గంలో కట్టాల్సిన సుజల స్రవంతి పథకాన్ని ఉద్దానంకు తరలించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుది. ఆయన 68 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల యువకుడిలా పరుగులు పెడుతున్నారు. 32 ఏళ్ల యువకుడినైన నేనే ఆయన వేగాన్ని అందుకోలేకపోతున్నాను అంటూ గుర్తు చేశారు.