శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (11:14 IST)

చర్మంపైనా బ్లాక్ ఫంగస్ కాటు : కర్నాటక రాష్ట్రంలో తొలి కేసు

దేశంలో కొత్తగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. ఈ కేసు కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో నమోదైంది. నిజానికి ఇప్పటికే దేశ ప్రజలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ బారినపడిన అనేక వేల మంది మృత్యువాతపడుతున్నారు. 
 
ఈ వైరస్ నుంచి కోలుకోకముందే దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇందులో అనేక రకాలైన ఫంగస్ కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఎల్లో ఫంగస్ కేసు ఏపీలోని కర్నూలు జిల్లాలో నమోదైంది. ఇపుడు కొత్తగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు కొత్తగా నమోదు కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 
 
చిత్రదుర్గ జిల్లాలో 50 ఏళ్ల రోగిలో స్కిన్ బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని దేశంలో ఇదే ఫ‌స్ట‌ కేసు అని వైద్యుల బృందం తెలిపింది. నెల క్రితం కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న బాధితుడి చర్మంపై బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని వైద్యులు తెలిపారు. బాధితుడికి మధుమేహం కూడా ఉందని పేర్కొన్నారు. 
 
బాధితుడి కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని డాక్ట‌ర్లు తెలిపారు. ఇప్పటికే ఆ బాధితుడికి మొదటి దశ ఆప‌రేష‌న్ ద్వారా చర్మంపై ఉన్న బ్లాక్‌ ఫంగస్‌ను తొలగించగా ఇప్పుడు రెండో దశ చికిత్సకు సిద్ధమవుతున్నారు. బ్లాక్​ ఫంగస్​పై రోజుకో వార్త దేశ ప్రజలను భయపెడుతోంది.
 
కాగా.. ఈ బ్లాక్​ ఫంగస్​ మెదడుపైనా ప్రభావం చూపిస్తోందని తేలింది. మధ్యప్రదేశ్​ ఇండోర్​లోని మహారాజా యశ్వంత్​రావ్​ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన రోగుల్లో 15శాతం మంది మెదళ్లలో ఈ బ్లాంక్​ ఫంగస్​ను గుర్తించారు. 
 
తలనొప్పి, వాంతులు బ్లాక్ ఫంగ‌స్ యొక్క‌ ప్రాథమిక లక్షణాలు కాగా.. మెదడులో వ్యాధి ముదిరితే రోగి సృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. సైనస్​ ద్వారా ఈ బ్లాక్​ ఫంగస్​ మొదడుకు చేరే అవకాశముందని వైద్యులు అభిప్రాయపడ్డారు.