శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (13:11 IST)

కాకికి ఎంత తెలివి.. చెత్తను ఏరి చెత్తబుట్టలో వేస్తుంది.. వీడియో వైరల్

మూగ జీవులకున్న తెలివి ప్రస్తుతం మనుషులకు లేదనే చెప్పాలి. పరిసరాల పరిశుభ్రత విషయంలో మనుషులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన దాఖలాలు అనేకం. కాని మూగజీవులకు పరిసరాలపై వున్న శ్రద్ధను చూస్తే జనాలు ఆశ్చర్యపోవాల్సిందే. 
 
అయితే ప్రస్తుతం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నారు ప్రజలు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చిన్న వీడియో వైరల్ అవుతుంది. కాకి చెత్తను ఏరి రోడ్డు పక్కన ఉన్న చెత్తబుట్టలో వేస్తుంది. 38 సెక్షన్ల నిడివి ఉన్న ఈ చిన్న వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
సుశాంత నంద షేర్ చేసిన ఈ వీడియోకు రెండు వేలకు పైగా లైక్‌లు రాగా, 14 వేలమందికి పైగా వ్యూస్ రావడం విశేషం. పరిసరాల పరిశుభ్రతపై కాకికి ఉన్నంత జ్ఞానం మనిషికి లేదని, షేమ్ అని సుశాంత నంద ఈ వీడియోకు క్యాప్షన్ ఇవ్వడం అందరిని ఆలోచనలో పడేసింది.