`బ్రాందీ డైరీస్` అర్జున్ రెడ్డి లాంటి సినిమాః నిర్మాతలు
Brandy Diaries trailer
రామసత్యనారాయణ మాట్లాడుతూ, చాలా వరకు కథా బలం లేకుండా సినిమాలు వస్తున్నాయి. కానీ బ్రాందీ డైరీస్ మంచి కథబలం ఉన్న సినిమా. ఇటీవలే సినిమా చూశాను. ఇది అర్జున్ రెడ్డి లాంటి సినిమా. అందరికీ అంత పేరొచ్చే సినిమా అవుతుంది. సినిమాలో స్టార్స్ ఎవరూ లేరు అందరూ కొత్త వాళ్ళే. డైరెక్టర్ విసుగు లేకుండా ఆడియన్ కూర్చోబెట్టేలా ఆసక్తిగా తెరకెక్కించారు. టైటిల్ తోనే సినిమా ఎలా ఉంటుందో వివరణ ఇచ్చారు. యూత్ కోసం తీసిన సినిమా ఇది. నిర్మాతల మండలి నుండి ప్రతీ చిన్న సినిమాకు సహకారం అందిస్తున్నాము. వైజాగ్ లో చిన్న సినిమాలకు శంకర్ బెస్ట్ డిస్ట్రిబ్యూటర్. అతను ఈ సినిమాను వైజాగ్ , ఈస్ట్ లో విడుదల చేస్తున్నాడు. 'వకీల్ సాబ్' రిలీజ్ రోజే సినిమాను రిలీజ్ చేయమని సలహా ఇచ్చాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారు అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ " కరోన టైంలో భయపడని ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది బ్రాందీ షాపులే. మద్యం అనేది చాలా మందికి నిత్యవసం అయిపోయింది. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు. అద్భుతమైన టైటిల్ ఇది. చిన్న సినిమాల మధ్య వచ్చి ఇబ్బంది పడకుండా పెద్ద సినిమాతో వస్తే కొన్ని థియేటర్స్ లభిస్తాయి. ఏప్రిల్ 10 న వస్తే బెటర్ గా ఉంటుందని నా సలహా. మద్యం గురించి తీసిన ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా"అన్నారు.
Sunita, Sekar
నిర్మాత మాట్లాడుతూ, సహజత్వానికి పట్టం కడుతూ పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా రూపుదిద్దుకుంది. కథే ముఖ్య పాత్రగా 52 రోజుల్లో 104 లొకేషన్లలో సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాము. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ నాణ్యతతో తీసిన మా సినిమా అన్నారు.
హీరో శేఖర్, హీరోయిన్ సునీత, సద్గురు, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్శంకర్ మాట్లాడుతూ, సినిమా విజయవంతం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.
