ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (19:06 IST)

జైశంకర్ స్పీచ్.. అమెరికాలో వున్న నా కుమారుడితో రెస్టారెంట్‌కు వెళ్తే..?

Dr S Jaishankar
Dr S Jaishankar
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆసక్తికరమైన స్పీచ్ నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలో వున్న తన కుమారుడితో కలిసి రెస్టారంట్‌కి వెళ్లిన సందర్భంగా చోటుచేసుకున్న సందర్భాన్ని చెప్పుకొచ్చారు. 2021లో తన కుమారుడితో కలిసి అమెరికా రెస్టారెంట్‌‌కు వెళ్లామన్నారు. 
 
అక్కడ కోవిడ్ సర్టిఫికేట్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడిగారు. తాను తన ఫోనులోని కోవిడ్ సర్టిఫికేట్‌ను చూపెట్టగా.. తన కుమారుడు వ్యాలెట్ లోని కోవిడ్ సర్టిఫికేట్ పేపర్ రూపంలో వుండటాన్ని చూపెట్టాడని తెలిపారు. 
 
అప్పుడు అనుకున్నాను. అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ సర్టిఫికేట్ వ్యాలెట్ లోని పేపర్ రూపంలో వుందని.. అదే మనదేశం కోవిడ్ సర్టిఫికేట్ స్మార్ట్ ఫోన్‌ ద్వారా చూపెట్టిందని.. దీంతో మనదేశం ఎక్కడుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చునని.. జైశంకర్ తెలిపారు.