శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2022 (15:56 IST)

వెంటిలేటరుపై సల్మాన్ రష్దీ - న్యూయార్క్‌లో కత్తితో దాడి..

salman rushdie
ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్డీపై అమెకాలోని న్యూయార్క్‌లో దాడి జరిగింది. కత్తితో చేసిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రాణాపాయస్థితిలో వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందిస్తున్నారు.  
 
భారత సంతతికి చెందిన సల్మాన్ రష్డీ.. ఆయన రచించిన "ద శాటానిక్ వర్సెస్" నవల ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ ఛాందసవాదుల ఆగ్రహానికి గురైంది. రష్డీని చంపేయాలంటూ అప్పట్లో ఇరాన్ మహానేత ఆయతొల్లా ఖొమేని ఫత్వా కూడా జారీచేశారు. ఈ క్రమంలో న్యూయార్క‌లో ఆయనపై కత్తితో దాడి చేశారు. ఆయనపై ఓ అగంతకుడు కత్తితో విరుచుకుపడ్డాడు. ఏకంగా 10 నుంచి 15 కత్తిపోట్లు పొడవడంతో రష్డీ వేదికపైనే కుప్పకూలిపోయాడు. 
 
ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటరుపై ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ కత్తిపోట్ల కారణంగా ఆయన ఓ కన్ను కోల్పోయే ప్రమాదం వుందని రష్డీ ప్రతినిధి ఆండ్రూ వైలీ వెల్లడించారు. కత్తిపోటు వల్ల కాలేయం కూడా దెబ్బతిందని తెలిపారు. మోచేతి నరాలు ఛిద్రమైపోయాయని ఆయన వివరించారు.