వింబుల్డన్ టెన్నిస్ : సానియా మీర్జా జోడీ ఓటమి
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా జోడీ ఓడిపోయింది. మిక్స్‌డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా జోడీకి ఓటమి తప్పలేదు. తొలి సెట్‌లో దక్కిన ఆధిక్యం కాపాడుకోలేక పోయారు. దీంతో సెమీస్ పోరులో ఓటమి పాలయ్యారు.
బుధవారం రాత్రి జరిగిన సెమీస్ ఫైనల్‌లో సానియా - పవిచ్ జంట 6-4, 5-7, 4-6 తేడాతో ఇంగ్లండ్, అమెరికా ద్వయం నీల్ స్కూప్ స్కీ - క్రావ్ జిక్ జంట చేతిలో పరాజయం పాలైంది.
కాగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో సోనియా మీర్జా జోడీ సెమీ ఫైనల్ వరకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచారు. ఒక్క వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం ఆమెకు టైటిల్ వరించలేదు.