సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (10:28 IST)

అమెరికాలో వరుడు-కన్యాకుమారిలో వధువు.. ఆన్‌లైన్ పెళ్లికి రిజిస్ట్రేషన్ కావాలి

marriage
అమెరికాలో వరుడు- కన్యాకుమారిలో వధువు- ఆన్‌లైన్‌లో పెళ్లి.. ఇలా అమెరికాలో ఉన్న వరుడిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తమిళనాడులో ఓ యువతి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలని, ఆ వివాహాన్ని రిజిస్టర్‌ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
 
వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా మణవాళకురిచ్చికి చెందిన వంశీ సుదర్శిని అనే యువతి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అమెరికాలో ఉన్న రాహుల్‌, వంశీ సుదర్శిని ప్రేమించుకున్నారు. పెళ్లి కోసం రాహుల్‌ భారత్‌ వచ్చారు. వివాహానికి మణవాళకురిచ్చి రిజిస్ట్రార్ కారణం లేకుండా నిరాకరించారు. వీసా గడువు ముగియడంతో రాహుల్‌ తిరిగి అమెరికా వెళ్లిపోయారు.
 
దీంతో ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సులో పెళ్లి చేసుకునేందుకు, చట్ట ప్రకారం నమోదు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని సదరు యువతి ధర్మాసనాన్ని కోరారు. న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ పిటిషన్‌ను విచారించారు. ఈ పెళ్లి చేసుకునేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని తెలిపారు. 
 
వివాహ రిజిస్టర్‌లో వధూవరుల సంతకాలు రెండూ వధువే చేయవచ్చని పేర్కొన్నారు. దాని ప్రకారం ఆ వివాహాన్ని చట్ట ప్రకారం నమోదు చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.