శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (18:16 IST)

చికాగో వ్యభిచారం దందా వెనుక తెలుగు తమ్ముళ్లు : వాసిరెడ్డి పద్మ

ఇటీవల అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందా వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఉన్నారని వైకాపా ఎమ్మెల్యే వాసిరెడ్డి పద్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ వ్యభి

ఇటీవల అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందా వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఉన్నారని వైకాపా ఎమ్మెల్యే వాసిరెడ్డి పద్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ వ్యభిచార దందాను టీడీపీలోని వ్యక్తులు, ఆ పార్టీలోని సన్నిహితులు నడుపుతున్నారని ఆరోపించారు. 
 
ఈ వ్యభిచార రాకెట్ వల్ల తెలుగువారి పరువు అంతర్జాతీయంగా పోయిందన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేత విచారణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ప్రశ్నించినట్టు  తెలుస్తోందని, చంద్రబాబు, లోకేష్‌లకు ఆయన అత్యంత సన్నిహితుడని ఆమె ఆరోపించారు. 
 
కాగా, ఇటీవల చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాకు సూత్రధారులు మొదుగమూడి కిషన్, ఆయన భార్య మొదుగుమూడి చంద్రలు ప్రధాన సూత్రధారులు కావడంతో వారిద్దరనీ యూఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో పలువురు హీరోయిన్లకు కూడా సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి.