శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (11:18 IST)

ఫైర్ పానీపూరీ.. గుజరాత్‌లో ఇదే ట్రెండింగ్

fire panipuri
పానీపూరీ తినడం తెలిసి అందరికీ తెలిసిందే. అయితే నిప్పుతో పాటు పానీ పూరీని టేస్టు చేశారా.. అయితే ఈ స్టోరీ చూడండి. నిప్పుతో పాటు పానీ పూరీని తినే కొత్త ధోరణి ఇప్పుడు గుజరాత్‌లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది.
 
ఉత్తర భారత వంటకాల్లో ఒకటైన పానీపురిని భారతదేశం అంతటా విక్రయిస్తున్నారు. పానీపూరీ అంటేనే లొట్టలేసుకుని తినేవారు చాలామంది వున్నారు. తాజాగా పానీపురి మంటలతో పాటు తినడం ఇప్పుడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రాచుర్యం పొందుతోంది.
 
పానీపురి వీధి స్టాల్స్‌లో ఈ ఫైర్ పానీపూరీలు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఫైర్ పానీపురి అని పిలువబడే ఈ పానీపూరీలను తింటూ ఒక మహిళ వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.