శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (21:44 IST)

ఐపీఎల్ 2022: అలరించనున్న కొత్త జట్లు.. వివరాలివే

ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగే కొత్త జట్ల వివరాలను బీసీసీఐ సోమవారం వెల్లడించింది. అందరూ ఊహించనట్లుగానే అహ్మదాబాద్ బేస్‌గా ఓ జట్టు.. లక్నో బేస్‌గా మరో జట్టు వచ్చే సీజన్‌లో అలరించనుంది. అయితే అహ్మదాబాద్ బేస్ టీమ్‌ను సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సొంతం చేసుకోగా.. సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీఎస్‌జీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది.
 
ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ రూ. 7090 కోట్లతో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సొంతం చేసుకోని మళ్లీ ధనాధన్ లీగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో ఆర్‌ఎస్‌జీ గ్రూప్‌కు చెందిన రైజింగ్ పునే సూపర్‌జెయింట్ టీమ్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
 
ఇక లక్నో ఫ్రాంచైజీని సీవీసీ ఓనర్స్ రూ. 5625 కోట్లకు దక్కించుకుంది. ఈ రెండు జట్ల కోసం మొత్తం 9 బడా కంపెనీలు పోటీపడ్డాయి. అహ్మదాబాద్, కటక్, ధర్మశాల, గౌహతి, ఇండోర్, లక్నో నగరాలకు బిడ్డింగ్ జరగ్గా అన్ని కంపెనీలు అహ్మదాబాద్, లక్నోకు బిడ్డింగ్ వేసాయి. 
 
అత్యధికంగా గోయెంకాకు చెందిన ఆర్‌పీఎస్‌జీ లక్నోతో పాటు అహ్మదాబాద్‌కు రూ. 7090 కోట్లు బిడ్ వేసింది. ఈ రెండు నగరాలకే కాకుండా ఇండోర్‌కు 4,790 కోట్లు పెట్టేందుకు సిద్దమైంది. హయ్యెస్ట్ కోట్ చేసిన ఈ కంపెనీకే లక్నో ఫ్రాంచైజీ దక్కింది. ఆ తర్వాత ఉన్న సీవీసికి అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ వరించింది. ఇక లీగ్‌లో కొత్త జట్ల రాకతో మెగావేలం జరగనుంది. దాంతో ప్రస్తుతం జట్లలో ఉన్న ఆటగాళ్లంతా మారనున్నారు.