బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (09:49 IST)

నిత్యానంద గాయబ్ : నిత్య వివాదాల స్వామీజీ ఎక్కడ?

నిత్య వివాదాల స్వామీజీగా గుర్తింపు పొందిన నిత్యానంద కనిపించడం లేదు. ఆధ్యాత్మిక ముసుగులో ఆశ్రమంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన గత కొన్ని రోజులుగా బెంగుళూరు ఆశ్రమంలో కనిపించడం లేదు. దీంతో ఆయన విదేశాలకు పారిపోయాడనే ప్రచారం సాగుతోంది. 
 
నిజానికి నిత్యానంద స్వామీజీపై నమోదైన పలు కేసులతో పాటు అత్యాచార కేసు దర్యాప్తు వేగవంతమైంది. అదేసమయంలో ఆయన పాస్‌పోర్టు కాలపరిమితి కూడా ముగిసింది. దీంతో ఆయన కేమన్ ఐల్యాండ్‌కు పారిపోయివుంటాడని కొందరు అంటుంటే మరింకొందరు మాత్రం తపస్సు కోసం హిమాలయాలకు వెళ్లారని అంటున్నారు. 
 
కానీ, ఆయన కొన్ని రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. పైగా బెంగుళూరు ఆశ్రమంలో కూడా లేరు. దీంతో ఆయన ఖచ్చితంగా దేశం విడిచి పారిపోయివుంటారని స్థానికులు అంటున్నారు. కానీ, ఆయన శిష్యులు మాత్రం అలాంటిదేం లేదనీ, ఆయన ఆధ్యాత్మిక చింతనలో భాగంగా హిమాలయాలకు వెళ్లారని అంటున్నారు. ఇదే విషయంపై పోలీసులు స్పందిస్తూ, నిత్యానందకు సంబంధించిన సమాచారమేదీ తమవద్ద లేదని అంటున్నారు.