గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (17:44 IST)

అడవికి రారాజు సింహానికే సీన్ రివర్స్ అయ్యిందిగా!

Lion
అడవికి రారాజు సింహం. సింహాన్ని చూస్తే.. మిగిలిన జంతువులు పరుగులు తీస్తాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. వివరాల్లోకి వెళితే... జిరాఫీల గుంపు నుంచి ఓ ఆడ జిరాఫీ, జిరాఫీ పిల్ల తప్పిపోయింది. వాటిని దూరం నుంచి చూసిన ఓ ఆడ సింహం.. వేటాడేందుకు వెంటపడింది. మట్టుబెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూసింది. ఇక ఆ క్షణం రానే వచ్చింది. 
 
ఆడ సింహం నుంచి తప్పించుకునే క్రమంలో జిరాఫీ, జిరాఫీ పిల్ల రెండూ వేర్వేరు అయ్యాయి. అదే అదునుగా చేసుకుని జిరాఫీ పిల్లపై సింహం విరుచుకుపడింది. తన పదునైన దవడలతో ఆ పిల్లను నోటకరుచుకుని నది ఒడ్డుకు తీసుకెళ్లింది.
 
ఆడ సింహం పంజా దెబ్బకు జిరాఫీ పిల్ల ప్రాణాలు కోల్పోయిందని అక్కడికొచ్చిన పర్యాటకులు అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా జిరాఫీ పిల్ల స్పృహలోకి వచ్చి.. తనను తాను రక్షించుకునేందుకు నదిలోకి దిగింది. 
 
సుమారు ఏడు గంటల పాటు అందులోనే ఉంది. అయితే ఆడ సింహం చేసిన గాయాలకు నిలవలేకపోయిన జిరాఫీ పిల్ల ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఈ షాకింగ్‌ వీడియోను పర్యాటకులు తీయగా.. ఇది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.