భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!
ఉగ్రవాదులు, బాంబు పేలుళ్లు, తీవ్రవాదులు, మానవబాంబు దాడులతో అతలాకుతలం అయ్యే పాకిస్తాన్ దేశం భారతదేశం కంటే సేఫెస్ట్ కంట్రీ అంటూ సేఫ్టీ ఇండెక్స్ రిపోర్టులో తేలింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఐతే ఆసక్తికర విషయం ఏంటంటే... అమెరికా, బ్రిటన్ కంటే భారత్ సేఫ్టీ కంట్రీ అని రిపోర్టులో రావడం.
భారతదేశం సేఫ్టీ ర్యాంక్ నెంబర్ ఎంతన్నది తెలుసుకునే ముందు సేఫ్టీలో టాప్ 5 దేశాలు ఏమిటో చూద్దాము. అండోర్ర మొదటి స్థానంలో వుండగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండో స్థానంలో వుంది. తృతీయ స్థానంలో ఖతార్ వుండగా తైవాన్ నాలుగో స్థానంలో, ఒమన్ దేశం ఐదవ స్థానంలో వున్నది.
శక్తివంతమైన సైనికదళం, సాంకేతికంగా సూపర్ సోనిక్ అయిన అమెరికా ఈ సేఫ్టీ లిస్టులో కనీసం టాప్ 50లో కూడా లేదు. అమెరికా 89వ స్థానంలో వున్నది. బ్రిటన్ 87వ స్థానంలో వుండా భారతదేశం 66వ స్థానంలో వుంది. పాకిస్తాన్ 65వ స్థానంలో నిలిచింది. పొరుగునే వున్న చైనా 15వ స్థానంలో వుంది. భద్రత విషయంలో అన్ని దేశాల కంటే చిట్టచివరన వెనుజులా 147వ స్థానంలో వుంది. ఆఫ్ఘనిస్తాన్ 144వ స్థానంలో వుండగా దక్షిణాఫ్రికా 143వ స్థానంలో వుంది.