ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 2 మే 2021 (10:17 IST)

తిరుపతిలో ఫ్యాన్ స్పీడ్- 22 వేల ఓట్ల మెజారిటీ, పత్తా లేని జనసేన-భాజపా

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాల్లో వైసిపి అభ్యర్థి గురుమూర్తి దూసుకు వెళుతున్నారు. మొదటి రౌండులో ఆయన తన సమీప తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిపై 22 వేల ఓట్లు మెజారిటీతో వున్నారు. ప్రతి రౌండుకు ఆయన మెజారిటీ పెరుగుతూ వెళ్తోంది.
 
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌‌లలో వైసీపీ విజయం ఖాయమని చెప్పారు. ఇప్పుడు దాదాపు అవే నిజం కాబోతున్నాయి. కాగా జనసేన-భాజపాకి కలిసి కేవలం 3694 ఓట్లు వచ్చాయి.
 
ఇక నాగార్జున సాగర్ అసెంబ్లీ ఫలితంలో తెరాస దూసుకు పోతోంది. అక్కడ నోముల భగత్ తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై 6 వేల మెజారిటీతో వున్నారు. కాగా 5 రౌండ్లు తర్వాత 957 మాత్రమే రావడం గమనార్హం.