శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2020
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (15:40 IST)

#Budget2020 : సీతక్క చిట్టాపద్దుల్లో ముఖ్యాంశాలు ఇవే...

కొత్త ఆర్థిక సంవత్సరం 2020-21కిగాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆమె తన ప్రసంగంలో అనేక కీలకాంశాలను వెల్లడించారు. ముఖ్యంగా, వేతనజీవులకు శుభవార్త చెప్పారు. రూ.5 లక్షల వరకు ఆదాయం వున్నవారికి పన్ను చెల్లింపుల నుంచి పూర్తిమినహాయింపు కల్పించారు. అలాగే, దేశంలో సరికొత్త విద్యావిధానాన్ని తీసుకుని రానున్నట్టు ప్రకటించారు. డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. 
 
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్.ఐ.సిని ప్రైవేటుపరం చేస్తామని, ఇందులోభాగంగా, కొంత వాటాను విక్రయిస్తామని తెలిపారు. అలాగే వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా అనేక ప్రోత్సాహకాలను ఆమె ప్రకటించారు. జీఎస్టీ విధానంతో పాటు.. ఆదాయపన్ను దాఖలు ప్రక్రియను మరింత సరళతరం చేయనున్నట్టు తెలిపారు. కాగా ఈ బడ్జెట్ ప్రసంగంలో ఉన్న ముఖ్యాంశాలను పరిశీలిస్తే, 
 
 
* భారత్‌లో జీ20 సదస్సు... నిర్వహణకు 100 కోట్లు కేటాయింపు
* విద్యారంగానికి 99 వేల 300 కోట్లు
*  ప్రధాని ఫసల్‌ బీమా యోజన ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
*  రానున్న ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లు..
*  3400 సాగర్‌ మిత్రలు ఏర్పాటు
*  గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్లు
* స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.12,300 కోట్లు
*  జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.11,500 కోట్లు
* ప్రధాని జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6,400 కోట్లు
* ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు
* 2026 నాటికి 150 విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులు
* విద్యారంగానికి రూ.99,300 కోట్లు
* నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3వేల కోట్లు
* రూ.లక్షా 3 వేల కోట్లతో మౌలికరంగ ప్రాజెక్టులు ప్రారంభం
* రాష్ట్రాల భాగస్వామ్యంతో ఐదు స్మార్ట్ సిటీలు
* జౌళిరంగానికి రూ.1480 కోట్లు
* రూ.2వేల కిలోమీటర్ల ల్యాండ్‌ టు పోర్టు రూట్‌కు రహదారుల నిర్మాణం
* పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సహకానికి రూ.27,300 కోట్లు
* బెంగళూరుకు రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే పథకం
* కేంద్రం 20శాతం అదనపు నిధుల ద్వారా 60శాతం సమీకరణ
* 11 వేల కిలోమీటర్ల మేర రైల్వేమార్గాల విద్యుదీకరణ
* ముంబై - అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు
* పర్యాటకరంగ ప్రోత్సహానికి త్వరలో మరిన్ని తేజస్‌ రైళ్లు
* రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1.7 లక్షల కోట్లు
* నేషనల్‌ గ్యాస్‌ గ్రిడ్‌ను 16,300 కి.మీ నుంచి 27 వేల కి. మీలకు పెంచేందుకు చర్యలు
* 2024 నాటికి దేశంలో కొత్తగా 100 విమానాశ్రయాలు
* నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్వాంటమ్‌ టెక్నాలజీస్‌కు నాలుగేళ్లలో రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తాం
* ఎస్సీలు, ఇతర వెనుకబడిన కులాలకు రూ.85 వేల కోట్లు కేటాయింపు
* ఎస్టీల కోసం రూ.53 వేల కోట్లు కేటాయింపు
* సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రూ.9,500 కోట్లు
* పౌష్టికాహార పథకం కోసం రూ.35,600 కోట్లు
* మహిళలు, శిశువుల కోసం పౌష్టికాహారం అందించేందుకు రూ.28,600 కోట్లు
* 5 పురావస్తు కేంద్రాల ఆధునికీకరణ, అభివృద్ధి
* పర్యాటకరంగ అభివృద్ధికి రూ.2 వేల కోట్లు
* నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400 కోట్లు
* ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల కోట్ల మూలధన సాయం
* డిపాజిటర్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు
* డిపాజిటర్ల బీమా కవరేజ్‌ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
* కంపెనీల చట్టంలో త్వరలో మార్పులు
* లద్దాఖ్‌ ప్రాంతానికి రూ.5,958 కోట్లు
* జమ్మూకాశ్మీర్‌కు రూ.30,757
* ప్రైవేటీకరణ దిశగా ఎల్‌ఐసీ
* ఎల్‌ఐసీ వాటా విక్రమాయానికి నిర్ణయం
* త్వరలో స్టాక్‌మార్కెట్‌లో ఎల్‌ఐసీ లిస్టింగ్‌
* ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం
* తొలిసారిగా ఎల్‌ఐసీ నుంచి ఐపీవో
* ఐపీవోల ద్వారా ఎల్‌ఐసీలో కొంతభాగం విక్రయం
* ద్రవ్య క్రమశిక్షణకు లోబడే ప్రభుత్వ వ్యయాలు 
* 2020-21 ఏడాదికి ద్రవ్యలోటు 3.5 శాతానికి కుదింపు
* 2019-20 ఏడాది ద్రవ్యలోటు 3.9 నుంచి 3.5 శాతానికి కుదింపు
* కార్పోరేట్‌ పన్నుల తగ్గింప విప్లవాత్మక నిర్ణయం
 
ఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులు
* మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు
* ఆదాయపన్ను శ్లాబ్‌లు 3 నుంచి 6 శ్లాబ్‌లకు పెంపు
* ఇంతకు ముందు 0 నుంచి 2.25 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను లేదు
* ఈ సంవత్సరం నుంచి రూ. 5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు.
* రూ.5లక్షల నుంచి  రూ.7.5 లక్షల వరకు 10శాతం ఆదాయపన్ను
* రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15శాతం పన్ను
* రూ.10 లక్షల నుంచి  రూ.12.5 లక్షల వరకు 20శాతం పన్ను
* రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25శాతం పన్ను
* రూ.15 లక్షలకు పైనా ఆదాయం ఉన్నవారికి 30శాతం పన్ను