మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2020
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (11:51 IST)

#Budget2020 : 11 కోట్ల మంది రైతులకు బీమా - చేపల రవాణాకు ప్రత్యేక రైలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగాన్ని ఉదయం 11 గంటల 03 నిమిషాలకు ప్రారంభించారు. తన ప్రసంగంలో పలు అంశాలను ఆమె ప్రస్తావించారు. ముఖ్యంగా, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. 11 కోట్ల మంది రైతులకు కిసాన్ బీమా యోజనా కల్పించనున్నట్టు ప్రకటించారు. చేపలు, రొయ్యలు వంటి తరలింపునకు ప్రత్యేక రైలును నడుపనున్నట్టు తెలిపారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, 
 
* ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌. 
* యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వం ప్రాధమ్యాలు ఉంటాయి.
* సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా చర్యలు.
* ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయి, ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. 
* నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. 
* కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు వెలుతుంది. 
* జీఎస్టీ ప్రవేశపెట్టాక దేశవ్యాప్తంగా పన్ను విధానంలో పారదర్శకత నెలకొంది. 
* చెక్‌పోస్టుల విధానానికి చెట్టిపెట్టి కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలికాం. 
* జీఎస్టీలోని సమస్యల పరిష్కారానికి జీఎస్టీ మండలి వేగంగా పనిచేస్తుంది. 
* జీఎస్టీ అమలు తర్వాత సామాన్యులకు నెలవారి ఖర్చు 4 శాతం ఆదా అయింది. 
* కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు చేరారు.
* ఇప్పటివరకు రూ.40 కోట్ల జీఎస్టీ రిటర్న్‌లు దాఖలయ్యాయి. 
* వర్షాభావ జిల్లాలకు అదనంగా నిధులు. 
* వర్షాభావ జిల్లాలకు సాగునీటి సౌకర్యం. 
* చేపల రవాణాకు ప్రత్యేక రైలు. 
* రైతులకు 20 లక్షల సోలార్‌ పంపుసెట్లు. 
* బీడు భూముల్లో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడి సాయం. 
* రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి. 
* భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణలు రైతులకు సహాయం.