1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2022
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (18:25 IST)

వార్షిక బడ్జెట్ 2022-23 : రక్షణ రంగానికి రూ.5.25 లక్షల కోట్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులోభాగంగా, మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఒక్క రక్షణ రంగానికే రూ.5.25 లక్షల కోట్లను ఆమె కేటాయించారు. అంటే 68 శాతం నిధులను ఒక్క రక్షణ శాఖకే కేటాయించారు. 
 
గత యేడాది బడ్జెట్‌లో కేవలం రూ.1.35 లక్షల కోట్లు కేటాయించగా, ఈ యేడాది ఈ మొత్తం రూ.5,25,166,15 కోట్లు కేటాయించారు. గత యేడాది కేటాయించిన మొత్తం కంటే ఇది 13 శాతం అధికం. ఈ విషయాన్ని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రక్షణ రంగంలో స్థానిక పరిశ్రమలకోసం మూనధన సేకరణ బడ్జెట్‌ల 68 శాతం నిధులు ప్రకటించారు. రక్షణ రంగానికి గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 58 శాతం మేరకు నిధులు పెంచగా, ఈసారి మరో పది శాతం నిధులను అదనంగా కేటాయించారు.