శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2017 (16:12 IST)

వాస్తు ప్రకారం.. ఇంట్లో అక్వేరియం ఉంటే? అప్పులేనా?

వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియంను పెంచకూడదట. తొట్టెలో లేదా గ్లాసు పెట్టెల్లో నీళ్లుపోసి అందులో చేపలను పెంచడం ద్వారా ఆ ఇంటి యజమానికి మానసిక ఉల్లాసం ఉండబోదని, ఈతిబాధలు తప్పవని వాస్తు నిపుణులు అంటున్నారు

వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియంను పెంచకూడదట. తొట్టెలో లేదా గ్లాసు పెట్టెల్లో నీళ్లుపోసి అందులో చేపలను పెంచడం ద్వారా ఆ ఇంటి యజమానికి మానసిక ఉల్లాసం ఉండబోదని, ఈతిబాధలు తప్పవని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంకా అప్పుల బాధలు పెరిగిపోతాయి. అలాగే ఇంటి ముందు మనీ ప్లాంట్‌ తీగలు అల్లుకున్నట్లుంటే.. ఆ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉంటుందని వారు చెప్తున్నారు. 
 
ఇంట్లో పనిచేయని గడియారాలు, హాలులో మహాభారత యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు ఉండకూడదు. జీవితంలో ఉద్యోగాలు చేయడం భాగమైనట్లు.. ప్రకృతితో భాగం కావడమే వాస్తుగా పరిగణిస్తారు. అలాంటి ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలి. అలాగే ఇంట్లో కప్పలు, తలకు పైన వేలాయుధంతో కూడిన కుమార స్వామి బొమ్మ, అడుగు మించిన దేవతామూర్తుల విగ్రహాలు ఉండకూడదు.
 
వ్యాపారాలు చేసే ప్రాంతం వాస్తు ప్రకారం చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారం రూపంలో మాత్రమే ఉండాలి. తూర్పు, దక్షిణ దిశలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేస్తున్నవారైతే తూర్పు వైపు తిరిగి చేయాలి. ఇంటికి ఎదురుగా ఆస్పత్రులు, మాంసాహార దుకాణాలు, ఇనుము వస్తువుల తయారీ షాపులు ఉండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.