శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (14:05 IST)

మెట్లను "ఎల్" ఆకారంలో ఉండే విధంగా...?

గృహానికి మెట్లను నిర్మించడంలో కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్రాలు చెప్తున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లలను ఏవిధంగా నిర్మిస్తే శుభదాయకాలనే అంశాలను పరిశీలిస్తే.. 
 
1. మేడపైకి మెట్లు నిర్మించేటపుడు ఒక వరుస మెట్లను.. తూర్పు నుండి పడమరకు లేదా, ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మించాలి. 
2. రెండు వరుసలుగా నిర్మించేటపుడు.. మొదటి వరుస మెట్లను.. తూర్పు నుండి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండవ వరుస మెట్లు ఏ దిక్కుకైనా తిరిగినా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా నిర్మించాలి. 
3. రెండు వరుస మెట్లను నిర్మించేటపుడు ఒక వరుస ఉత్తరం నుండి దక్షిణం వైపు ఎక్కేవిధంగాను, రెండవ వరుస.. ఎటు తిరిగినా దక్షిణం నుండి ఉత్తరం ఎక్కేవిధంగా నిర్మించుకోవచ్చు. 
4. మెట్లను "ఎల్" ఆకారంలో ఉండే విధంగా నిర్మించాలనుకునే వారు ముందు తూర్పు నుండి పడమరకు గానీ, లేదా ఉత్తరం నుండి దక్షిణానికి గానీ ఎటువైపుకైనా నిర్మించుకోవచ్చు. 
5 గృహానికి వెలుపలి భాగంలో నిర్మించదలచే వారు.. ఈశాన్య, వాయవ్య, నైఋతి, ఆగ్నేయాలలో ఏ భాగంలో నైనా నిర్మించుకోవచ్చు. 
6. ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మించేటప్పుడు గృహానికి తూర్పు, ఈశాన్యం, లేదా ఉత్తర- ఈశాన్యాలవైపు నిర్మించుకోవచ్చు. 
7. ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు సమీపంలో ఉండకూడదు.