బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By ivr
Last Modified: బుధవారం, 15 మార్చి 2017 (18:35 IST)

బెడ్రూంలో అలాంటి వాల్ పేపర్స్ పెట్టకూడదట... ఎంచేతనంటే?

ఇంట్లో గోడలపై చేతికి అందిన వాల్ పేపర్లు తెచ్చేసి అంటించేస్తుంటారు చాలామంది. కానీ కొన్ని వాల్ పేపర్లు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని మోసుకొస్తాయట. కాబట్టి ఏ గదుల్లో ఎలాంటి వాల్ పేపర్స్ పెట్టాలో తెలుసుకుని వాటిని పెడితేనే ఇంట్లో మంచి వాతావరణం వుంటుంది. వర్క్

ఇంట్లో గోడలపై చేతికి అందిన వాల్ పేపర్లు తెచ్చేసి అంటించేస్తుంటారు చాలామంది. కానీ కొన్ని వాల్ పేపర్లు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని మోసుకొస్తాయట. కాబట్టి ఏ గదుల్లో ఎలాంటి వాల్ పేపర్స్ పెట్టాలో తెలుసుకుని వాటిని పెడితేనే ఇంట్లో మంచి వాతావరణం వుంటుంది. వర్క్ ఏరియా, పిల్లలు ఆడుకునే స్థలం, చదువుకునే స్థలం ఏదైనా సరే ఒకే గదిలో రకరకాల మూడ్స్‌ను బట్టి వాల్ పేపర్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
 
ముఖ్యంగా దంపతులు వుండే బెడ్రూంలో ఎలాంటి వాల్ పేపర్లు అంటించాలన్నది చాలామందికి తెలియదు. చూసేందుకు చాలా బావుంది కదా అని ఏవిబడితే అవి తెచ్చి పెట్టేసుకుంటుంటారు. ఐతే అలా పెట్టకూడదట. బెడ్రూంలో జంట పక్షులు కానీ రాధాకృష్ణుల ఫోటోలను కానీ పెట్టాలట. అంతేతప్ప ఒంటరి పక్షిని కానీ, భయంకరమైన రంగులతో కూడిన చిత్రాలను పెట్టకూడదట. అలా పెట్టినట్లయితే దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఇంకా కొంతమంది బెడ్రూంలో రెండు మంచాలను ఒకటిగా చేసి ఆనించి పడుకుంటారు. అలాంటివి చేయకూడదు. డబుల్ కాట్‌ను వాడాలి లేదంటే రెండు మంచాలయితే విడివిడిగా వేసుకుని పడుకోవాలి. అంతేకానీ, రెండింటినీ ఒకదగ్గరకు చేర్చి పడుకోరాదు.