శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 జూన్ 2015 (18:29 IST)

టమోటాతో టేస్టీ గ్రేవీ ఎలా చేయాలి?

టమోటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టమోటాలో విటమిన్ సి మాత్రమే కాకుండా మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్‌లు కూడా ఉన్నాయి. కూరల్లో మాత్రమే గాకుండా టమోటాలను సలాడ్స్, శాండ్‌విచ్, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. అలాంటి టమోటాతో టేస్టీ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
ఉల్లి తరుగు - అరకప్పు 
టమోటా గుజ్జు - ఒక కప్పు 
కారం - ఒకటిన్నర టీ స్పూన్ 
నూనె, ఉప్పు - తగినంత 
తాలింపుకు - ఆవాలు, ఉద్దిపప్పు 
కరివేపాకు, కొత్తిమీర - గార్నిష్‌కు 
లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, గసగసాలు - అర టేబుల్ స్పూన్,
ధనియాలు- ఒక స్పూన్
వెల్లుల్లి, అల్లం పేస్ట్ - ఒక టీ స్పూన్
కొబ్బరి తురుము: అరకప్పు
 
తయారీ విధానం :
పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేసి వేపాలు. అందులోనే ఉద్దిపప్పు, శెనగపప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.. తర్వాత అందులో ఉల్లిపాయలు, టమోటో గుజ్జు, కరివేపాకు, కొత్తిమీర వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, అల్లం వెల్లుల్లి, కొబ్బరి, మసాలాలను వేపుకుని రుబ్బిపెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని టమోటా గుజ్జుతో చేర్చి కారం, ఉప్పు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత దించేయాలి. అంతే టమోటా టేస్టీ గ్రేవీ రెడీ.