Dharma Sangrah
✕

స్త్రీలలో నడుము నొప్పి.. తొలగిపోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి..

Written By సందీప్
Updated: శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (11:38 IST)
స్త్రీలలో నడుము నొప్పి సమస్య చాలా మందికి ఉంటుంది. నడుము పట్టేయడం, వెన్నునొప్పితో బాధపడుతుంటారు. ఆ భాగంలోని కండరాలు, ఎముకలు బలహీనపడటం ఒక కారణమయితే, గర్భధారణ, ప్రసవం, గర్భాశయంలో సమస్యలు, ఫైబ్రాయిడ్లు మరికొన్ని కారణాలు. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఆయుర్వేదంలో చికిత్స ఉంది. 
 
పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కడుపులో గ్యాస్‌ను పెంచే సెనగలు, మసాలా పదార్థాల వంటి వాటిని దూరం పెట్టాలి. కూర్చునే, నిల్చునే భంగిమ చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు వంగినట్లు కూర్చోకూడదు. ఒక కప్పు నువ్వుల నూనెలో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్‌ను కలుపుకుని నడుముకు రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. 
 
శొంఠి కషాయంలో కొద్దిగా ఆముదం కలుపుకుని నడుముకు రాసుకుంటే కూడా నడుము నొప్పి తగ్గుతుంది. కప్పు నీళ్లలో కొద్దిగా మిరియాలు, లవంగాలు, శొంఠి పొడి వేసుకుని టీలా కాచుకోవాలి. ఈ టీను ప్రతిరోజూ నడుముకు రాసుకోవడం వలన నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు రెండు మార్లు నడుముకు రాసుకోవాలి. కొబ్బరి నూనెను వేడిచేసుకుని అందులో కొద్దిగా కర్పూరం వేసి కరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నడుముకు మర్దనా చేసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది.

అన్నీ చూడండి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ - 3 దశల్లో పోలింగ్

స్థానిక సంస్థల ఎన్నికలు: జనసేన-తెదేపా మధ్య లుకలుకలు మొదలయ్యాయా?

రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం - 78 రోజుల బోనస్ ప్రకటన

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం : ఇకపై రోజువారీ విచారణ

కుళ్లిపోయిన చికెన్ : హైదరాబాద్ నగరంలో నాలుగు హోటళ్ళకు రద్దు

అన్నీ చూడండి

కాకలో బాలకృష్ణ తనయ... ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా?

యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచిన రాయవలస ..లోని రింగుడు రింగుడు పాట

Street Fighter: 90ల నాటి జ్ఞాపకాలతో ‘స్ట్రీట్ ఫైటర్ రాబోతోంది

డీప్‌ఫేక్‌లు విసుగు పుట్టించేవి, ప్రమాదకరమైనవి.. శ్రియా చరణ్

తమిళనాడు రాజకీయాల్లోకి నయనతార.. భర్త ఏమన్నారంటే...

తర్వాతి కథనం
Show comments