1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. hair care in rainy season,

వర్షాకాలంలో శిరోజాల సంరక్షణ ఎలా?

rainy season
వర్షాకాలంలో శిరోజాల సంరక్షణ చాలా శ్రమతో కూడుకున్న పని. వర్షాకాలంలో పదేపదే తడుస్తుంటాం. దీంతో వెంట్రుకలు కూడా తడవడం వల్ల శిరోజాల నుంచి ఒక విధమైన వాసన వస్తుంది. అలాగే, జుట్టు తెట్టుగా అంటుకుపోయినట్టు తయారవుతుంది. వర్షపు జల్లులకు తరచూ తడిస్తే మరింత జిడ్డు కారినట్టు అనిపిస్తుంది. శిరోజాల తత్త్వాన్ని అనుసరించి జీవన విధానాన్ని బట్టి హెయిర్ స్టైయిలింగ్ ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలంలో జుట్టు రాలిపోవడం అనేది చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. 
 
ఈ వర్షాకాలంలో శిరోజాల పరిరక్షణ కోసం వారంలో ఒకసారి అయినా వేడి నూనెతో మసాజ్ చేసుకోవాలి. నూనె పెట్టుకోవడం ప్యాషన్ కాదని వదిలివేయకూడదు. నూనె పెట్టుకోవడం వల్ల రక్తప్రసరణ మెరగవుతుంది. పొడిబారిన మాడుకు మంచి పోషణలాంటింది. 
 
అలాగే, తల స్నానానికి జెల్ ఆధారిత షాంపులను వినియోగించాలి. వీటివల్ల జిడ్డు లేకుండా ఉంటాయి. వర్మింగ్, కలరింగ్ వంటి కెమికల్ చికిత్సలకు ఇది అనువైన కాలం కాదు. చిక్కులు ఎక్కువగా పడుతున్నట్టయితే ఏవైనా స్మూథెనింగ్ సెరమ్స్ వాడాలి. వర్షాకాలలో త్వరగా తల ఆరదు కాబట్టి హెయిల్ డ్రయ్యర్‌లను జుట్టుకు దూరంగా ఉంచి ఆరబెట్టుకోవాలి. 
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి