గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (10:42 IST)

తల్లిపాలలో స్ట్రెస్ హార్మోన్.. భర్త తోడ్పాటు లేకపోతే.. పిల్లల్లోనూ నిరాశ, చిరాకు తప్పదు!

తల్లిపాలకు మించిన శ్రేష్ఠమైన ఆహారం మరోటి లేదంటారు. కానీ ఒంటరిగా ఉంటూ.. పెద్దలు లేకుండా.. అన్నీ పనులు ఒక్కతే చేసుకుని పిల్లలకు పాలిచ్చే తల్లుల్లో స్ట్రెస్ హార్మోన్ ఉంటుందని అధ్యయనంలో తేలింది. అన్నీ పన

తల్లిపాలకు మించిన శ్రేష్ఠమైన ఆహారం మరోటి లేదంటారు. కానీ ఒంటరిగా ఉంటూ.. పెద్దలు లేకుండా.. అన్నీ పనులు ఒక్కతే చేసుకుని పిల్లలకు పాలిచ్చే తల్లుల్లో  స్ట్రెస్ హార్మోన్ ఉంటుందని అధ్యయనంలో తేలింది. అన్నీ పనులు చేసుకుంటూ.. ఒత్తిడిలో ఉన్న తల్లి ఇచ్చే పాల ద్వారా చిన్నారుల్లో ఒత్తిడి కూడా కలుగుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్లాండ్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ హార్మోన్‌ పెరిగితే పిల్లల్లో ఒత్తిడి అధికమై నిరాశ, చిరాకు వంటి భావోద్వేగ సమస్యలకు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు.
 
ముఖ్యంగా సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగిన తల్లులు, ఇంట్లో భర్త తోడ్పాటు లేకుండా ఒంటరిగా బిడ్డను సంరక్షించుకుంటూ.. ఒత్తిడికి గురైతే.. ఆ తల్లి ఇచ్చే పాలలోనూ కార్టిసోల్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా మూడు, నాలుగు నెలల వయసు బిడ్డలు ఉన్న 650 మంది తల్లుల పాలను పరీక్షించారు. ఈ పరిశోధనలో సిజేరియన్‌ ద్వారా ప్రసవించిన తల్లులు, ఒంటరి అమ్మల పాలల్లో కార్టిసోల్‌ స్థాయిలు అధికంగా ఉన్నట్లు తేలింది
 
మనుషుల్లో భావోద్వేగాల నియంత్రణ, పెరుగుదలకు కార్టిసోల్‌ అతి కీలకమని, శక్తిని కండరాల తయారీకి కాకుండా కొవ్వు తయారీకి ఇది ప్రేరేపిస్తుంది కాబట్టి శిశువుల్లో దీని స్థాయిలను మరింత ప్రాధాన్యం ఉంటుందని పరిశోధనలు తెలిపారు.