బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 మే 2017 (12:42 IST)

తెల్లబట్ట వ్యాధిని దూరం చేసుకోవాలంటే.. అరటిపండును నేతిలో ముంచి?

మహిళలను వేధించే తెల్లబట్ట వ్యాధిని దూరం చేసుకోవాలంటే.. రోజూ కలబంద గుజ్జును తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ ఉదయం ఒక స్పూను కలబంద గుజ్జుకు రెండు స్పూన్ల తేనె కలిపి తీసుకోవడం ద్వారా ఈ

మహిళలను వేధించే తెల్లబట్ట వ్యాధిని దూరం చేసుకోవాలంటే.. రోజూ కలబంద గుజ్జును తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ ఉదయం ఒక స్పూను కలబంద గుజ్జుకు రెండు స్పూన్ల తేనె కలిపి తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఒక కప్పు బియ్యం కడిగిన నీటిని ఉదయం, రాత్రి పూట సేవించడం ద్వారా ఈ వ్యాధి తగ్గిపోతుంది. 
 
సొరకాయను చిన్న ముక్కలుగా తరిగి.. బాగా ఎండబెట్టి చూర్ణంలా చేసుకోవాలి. దీనికి చెక్కర, తేనె కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉదయం, రాత్రి తీసుకుంటే వ్యాధి తగ్గిపోతుంది. అరటి పళ్లను నేతిలో ముంచి తింటుంటే తీవ్రంగా ఉన్న వ్యాధి సైతం తగ్గుతుంది. అలాగే పది గ్రాముల ధనియాలను కొద్దిగా నలగ్గొట్టి.. వంద ఎం.ఎల్ నీటిలో రాత్రి నాన బెట్టి ఉదయం తాగితే తెల్లబట్ట దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.