సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-06-2021 మంగళవారం రాశిఫలితాలు - లక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించినా...

మేషం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు, వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షించుకుంటారు. 
 
వృషభం : మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. అధికారులు, తోటి ఉద్యోగులతో సత్సబంధాలు నెలకొంటాయి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. 
 
మిథునం : ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
కర్కాటకం : రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. కళాకారులకు టీవీ, నాటకరంగంలో ఉన్నవారికి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. 
 
సింహం : స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఒప్పందాలు, రవాణా వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. ప్రముఖుల కలయిక సాధ్యం కాకపోవచ్చు. నూతన వ్యాపారాలు పరిశ్రమలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. 
 
కన్య : ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందుల ఎదురయ్యే సూచనలున్నాయి. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఖర్చులు బాగా పెరిగే అస్కారం ఉంది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ విషయాలలోనూ, వాహనం నడుపుతున్నపుడు జాగ్రత్త అవసరం. 
 
తుల : ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు సంభవిస్తాయి. మీ సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఏసీ, కూలర్ మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలుచేస్తారు. 
 
వృశ్చికం : దైవదర్శనాలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. లిటిగేషన్ వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. మిత్రులను కలుసుకుంటారు. మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. 
 
ధనస్సు : ఉపాధ్యాయులకు చికాకులు తప్పవు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు ప్రోత్సాహం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అవివాహితులతో నూతనోత్సహాం చోటుచేసుకుంటుంది. అదనపు ఖర్చులు వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. 
 
మకరం : భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదావేసుకోవలసి వస్తుంది. 
 
కుంభం : ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి వల్ల మీ కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. 
 
మీనం : ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి సత్ఫలితాలను పొందుతారు. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.