ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-02-2021 శనివారం రాశిఫలాలు - పద్మనాభ స్వామిని ఆరాధిస్తే జయ...

మేషం : దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఖర్చులు అధికం. మీకు ఉద్యోగంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఏదన్నా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల సలహాను పాటించుట వల్ల సమస్యలు తప్పవు. 
 
వృషభం : స్థిరచరాస్తుల విషయంలో మెళకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. విద్యార్థులకు అభివృద్ధి కానవస్తుంది. గృహంలో వస్తువు పోవడానికి అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
మిథునం : ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది. ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. మిమ్మల్ని హేళన చేసేవారు మీ సహాయాన్ని అర్థిస్తారు. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
కర్కాటకం : ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు. స్థిరచరాస్తుల కొనుగోలు విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీకు చాలా వేదన కలిగిస్తారు. మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమైనదని గమనించండి. 
 
సింహం : వస్త్ర, బంగారం వ్యాపారులకు సంతృప్తి. పురోభివృద్ధి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా నిర్వహిస్తారు. మిత్రులను కలుసుకుంటారు. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. విద్యార్థులలో చురుకదనం కానరాగలదు. 
 
కన్య : ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి విద్యార్థులకు మిత్ర బృందాలు పెరుగుతాయి. ఫ్లీడర్లకు పురోభివృద్ధి. వైద్యులకు ఒత్తిడి, ఇంజనీరింగ్ రంగాలలో వారికి చికాకు తప్పదు. ఊహించని ఖర్చులు అధికం కావడం వల్ల ఆందోళన తప్పదు. 
 
తుల : ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావుడి అధికంగా ఉంటాయి. అర్థాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. స్త్రీలకు షాపింగులలో ఏకాగ్రత అవసరం. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. మొండిబాకీలు వసూలు కాగలవు. 
 
వృశ్చికం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాటపడక తప్పదు. కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారులకు శుభదాయకం. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. 
 
ధనస్సు : బ్యాంకు వ్యవహారాలలో అచిరిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. భార్యాభర్తల మధ్య అవగాహనాలోపం అధికమవుతుంది. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభించగలదు. ఇతరుల విషయంలో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. 
 
మకరం : ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగాలయందు ఆశించిన ఆదాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలలో చికాకులు తప్పవు. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
కుంభం : మీ యత్నాలకు జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేయడం మంచిదికాదు అని గమనించండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. 
 
మీనం : విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి మరింత శ్రమించవలసి ఉంటుంది. స్త్రీలకు ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. ఇంటా బయటా ప్రశాంతం నెలకొంటుంది.