సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

#DailyHoroscope 01-02-2021 సోమవారం మీ రాశి ఫలితాలు ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు..?

ఉమాపతిని ఆరాధించినట్లైతే సంకల్పసిద్ధి, మనోసిద్ధి చేకూరుతుంది. 
 
మేషం: వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంత పాటు అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు అధికారులు సిఫార్సు చేస్తారు. ఐరన్, సిమెంట్, స్టాకిస్టులకు పురోభివృద్ధి. చిన్న తరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దుబారా ఖర్చులు నివారించడం సాధ్యపడకపోవచ్చు. 
 
వృషభం: మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఒక సమస్య పరిష్కారం కావడంతో కోర్టు వాజ్యాలు ఉపసంహరించుకుంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి వుంటుంది.
 
మిథునం: ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు విరుద్ధంగా వుంటాయి. ఆస్తి పంపకాల విషయంలో సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన విషయాలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. 
 
కర్కాటకం: మొక్కువోని ధైర్యంలతో మీ ప్రయత్నాలు కొనసాగించండి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పిడి, స్థానచలనం వంటి పరిణామాలున్నాయి. నిరుగ్యోగులు ఒక పత్రికా ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. స్త్రీలలో నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. అనుకోకుండా పాత బాకీలు వసూలవుతాయి. 
 
సింహం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. అనుమానాలు, అపోహలు, వీడి ఆత్మవిశ్వాసంతో శ్రమించండి. సత్ఫలితాలు లభిస్తాయి. తొందరపడి మాట జార విడవటం మంచిది కాదు. ఆత్మీయుల ఆహ్వానాలు మిమ్ములను సందిగ్ధానికి గురిచేస్తాయి.
 
కన్య: గృహ మార్పు వల్ల  ప్రయోజనం వుంటుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రుణదాతలతో కలహించక సర్దిచెప్పేందుకు ప్రయత్నించాలి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి వుంటుంది. మీ సమర్థతను కుటుంబీకులు, సన్నిహితులు గుర్తిస్తారు. మీ లోటుపాట్లు, తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.
 
తుల: దంపతుల మధ్య కలహాలు, విభేదాలు తలెత్తుతాయి. మీ సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగానీ చేపట్టిన పనులు పూర్తి కావు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను చేపడతారు. ఖర్చులు అధికం.
 
వృశ్చికం: స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన చోదకులకు చికాకులు అధికం. ప్రైవేట్ సంస్థల్లో మదుపు చేయడం మంచిది కాదని గమనించండి. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందులు తప్పవు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి.
 
ధనస్సు: స్త్రీలు ఇతరులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. విద్యార్థినులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. కొన్ని విషయాలు నచ్చకపోయినా సర్దుకుపోవలసి ఉంటుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యుత్ రంగాల్లో వారికి ఆందోళన తప్పదు. మీ నుంచి విషయాలు రాబట్టేందుకు ఎదుటివారు ప్రయత్నిస్తారు. 
 
మకరం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. ధన వ్యయంలో మితం పాటించండి. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కుంభం: ఆర్థికస్థితిలో ఆశాజనకమైన మార్పులుంటాయి. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయాల్సివస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. స్త్రీలు అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. 
 
మీనం: వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. కళలు, రాజకీయ, ప్రజా సంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాలు, పుణ్యక్షేత్ర సందర్శనల్లో పాత మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ శ్రీమతి సలహా తీసుకోవడం ఉత్తమం. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు.