మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-01-2021-ఆదివారం మీ రాశి ఫలితాలు - శ్రీమన్నారాయణ స్వామిని..?

శ్రీమన్నారాయణ స్వామిని తులసీ దళాలతో ఆరాధించినట్లైతే శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించేందుకు చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, అదుపు చాలా అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
 
వృషభం: రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేట్ సంస్థల వారికి మార్పు కానరాగలదు. స్త్రీలతో సంభాషించేటప్పుడు మెలకువ వహించండి. నిరుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యవసాయ కూలీలకు, భవన కార్మికులకు నూతన ఉత్సాహం కానవస్తుంది. మీ ఆకస్మిక ధోరణి కుటుంబీకులకు చికాకు కలిగిస్తుంది. 
 
మిథునం: బేకరి, తినుబండారాల వ్యాపారులకు లాభదాయకం. పారిశ్రామిక రంగాల్లో వారు స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సంతృప్తి కానవస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు తమ క్లయింట్‌ల ధోరణి వల్ల చికాకులు తప్పవు. 
 
కర్కాటకం: కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం, కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. విద్యార్థులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. 
 
సింహం: ఊహించని ఖర్చులు, ఇతరత్రా చెల్లింపుల వల్ల చికాకులు తప్పవు. విద్యార్థులు అనవసర భయాందోళనలు విడనాడి శ్రమించినట్లైతే జయం పొందగలరు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు.
 
కన్య: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పోటీతత్వం పెరుగుతుంది. కొబ్బరి పండ్ల పూల వ్యాపారులకు కలిసిరాగలదు. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. స్పెక్యులేషన్ విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రేమికుల తొందరపాటుతనం సమస్యలకు దారితీస్తుంది. 
 
తుల: కుటుంబీకుల కోసం నూతన పథకాలు రూపొందిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో ఇతరుల జోక్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. మానసిక ఆందోళన వల్ల ఆరోగ్య విషయంలో సంతృప్తి కానరాదు.
 
వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వ్యవసాయ రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. నిరుద్యోగులకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. 
 
ధనస్సు: ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందుతారు. మందులు, ఫ్యాన్సీ స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసి వచ్చేకాలం. అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. విద్యార్థులకు తోటివారి కారణంగా చికాకులు తప్పవు.
 
మకరం: ప్రైవేట్ సంస్థల్లోని వారు తోటి వారితో స్నేహ భావంతో సంచరిస్తారు. ముఖ్యుల సలహాలు పాటించడం వల్ల వ్యాపారంలో పురోభివృద్ధి కానవస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. ధాన్యం, కలప, పేపరు, యాంత్రిక వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
 
కుంభం: స్థిర, చరాస్తుల కొనుగోలు విషయమై ఆసక్తి కనబరుస్తారు. స్త్రీలకు ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు తలెత్తగలవు. జాగ్రత్తలు అవసరం. సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ అభిప్రాయాలకు, నిర్ణయాలకు కుటుంబీకుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెరిగినా మీ ఆర్థిక స్థితికి ఏమాత్రం లోటుండదు. 
 
మీనం: పోస్టల్, టెలిగ్రాఫ్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. రావలసిన ధనం అనుకోకుండా చేతికి అందుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.