బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-01-2021 శుక్రవారం దినఫలాలు - దుర్గాదేవిని పూజించి ఆరాధించినా..

మేషం : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. మీ ప్రమేయం లేకుండానే మాటపడవలసి వస్తుంది. జాగ్రత్త వహించండి. బంధువుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొనివుంటుంది. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులకు సరిపడా ధనం ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. మిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
మిథునం : వృత్తిపరంగా ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. గృహ నిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. కోర్టు వ్యాజ్యాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. 
 
కర్కాటకం : రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. సోదరీ, సోదరులతో విభేదాలు తప్పవు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఆదర్శభావాలు గల వ్యక్తితో ఆత్మీయబంధం బలపడుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. 
 
సింహం : మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యం. రావలసిన ధనం వాయిదాపడుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
కన్య : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం ఆందోళన కలిగిస్తుంది. 
 
తుల : భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శాస్త్ర సంబంధమన విషయాలు ఆసక్తిని చూపుతాయి. క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహన చోదకులకు మరమ్మతులు, జరినామాలు తప్పవు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ప్రముఖుల నుంచి బహుమతులు అందుకుంటారు. మీ సంతానం కదలికలను గమనించండి ఉద్యోగ స్త్రీలకు వాహన సౌఖ్యం వంటి శుభపరిణామాలు ఎదురవుతాయి. బంధువుల రాకతో ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి. 
 
ధనస్సు : ఓర్పు, నేర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతాయి. రవాణా, ప్రణాళికలు, బోధన ప్రకటనల రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. నమ్మిన వ్యక్తులు మోసగించే అవకాశం ఉంది. జాగ్రత్తగా గమనించండి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది. 
 
మకరం : ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. గృహం కొనుగోలు చేయు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఊహించని ఖర్చులు అధికం. సోదరీ, సోదరులతో మెళకువ వహిస్తారు. నూతన దంపతులకు సంతానం కలుగు సూచనలు కలవు. పెద్దలుగా బాధ్యతలు నిర్వహిస్తారు. 
 
కుంభం : బంధువుల రాకతో గృహంలో కళకళలాడుతుంది. మధ్యవర్తిత్వం వహించుట వల్ల ఇబ్బందులు తప్పవు. కిరాణా వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు లాభదాయకం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. 
 
మీనం : ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. స్త్రీలకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మొండిబాకీలు సైతం వసూలు అవుతాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారడం విశేషం.