గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-10-2024 శనివారం దినఫలితాలు : కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Libra
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పనులు పురమాయించవద్దు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ జోక్యం అనివార్యం. ధనలాభం ఉంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. దుబారా ఖర్చులు విపరీతం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. దైవదర్శలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పనుల్లో ఒత్తిడి అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఉపాధ్యాయులకు పనిభారం. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. రిటైర్డు ఉద్యోగులకు సాదర వీడ్కోలు పలుకుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. పొగిడే వ్యక్తుల అంతర్యం గ్రహించండి. ఖర్చులు అధికం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణ సమస్యలు తొలగుతాయి. పనుల్లో ఒత్తిడి అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పనులు వేగవంతమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పట్టుదలకు పోవద్దు. ఇతరుల తీరును గమనించి మెలగండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
చేసిన పనులే చేయవలసి వస్తుంది. చీటికిమాటికి చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. రావలసిన ధనం లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం. ఆప్తులతో సంభాషిస్తారు. సంతానం కృషి ఫలిస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి. ధనలాభం ఉంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనులు సానుకూలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వస్తులాభం వాహనసౌఖ్యం పొందుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ప్రముఖులకు ఘనస్వాగతం పలుకుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వివాదాలు పరిష్కారమవుతాయి.