సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-06-2024 సోమవారం దినఫలాలు - పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం...

astro4
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ చవితి సా.4.51 పుష్యమి రా.10.41 ఉ.వ.5.50 ల 7.31. ప.దు. 12.23 ల 1.15, పు.దు. 2.59 ల 3.51.
 
మేషం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులు ఇతరుల కారణంగా పైఅధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావటం మంచిది. కొబ్బరి, పండ్ల, పూల, చల్లని పానీయ వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. 
 
వృషభం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. పారిశ్రామిక సంస్థలు, ప్రైవేటు సంస్థలలోని వారికి పనివారితో చికాకులు తప్పవు. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. క్రయ విక్రయాలు లాభాసటిగా సాగుతాయి.
 
మిథునం :- పత్రికా సంస్థలలోని వారికి తోటివారి వల్ల చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఒక స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన విరమించుకోవటం శ్రేయస్కరం. గొట్టె, మత్స్య, పాడి పరిశ్రమ రంగాలలో వారికి సత్కాలం. ఖర్చులు అధికం కావడం వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు.
 
కర్కాటకం :- అపరాలు, కిరాణా, ఫ్యాన్సీ, ఆల్కహాల్ వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. స్త్రీలు అనవసర విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. దంపతుల మధ్య అకారణ కలహం. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. ప్రింటింగు, స్టేషనరీ రంగాలల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
సింహం :- వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. వ్యాపారస్తులకు తోటివారి, అధికారుల కారణంగా ఆందోళనకు గురవుతారు. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ప్రైవేటు సంస్థలలో వారికి కార్పెంటర్లకు, చేతి పనివారికి కలిసి వచ్చే కాలం. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
కన్య :- హోటల్ క్యాటరింగ్ పనివారలకు కలిసి వచ్చే కాలం. బంధువుల రాకపోకల వల్ల గృహంలో సందండి వాతావరణం చోటుచేసుకుంటుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. సినిమా, విధ్య, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
తుల :- స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. గృహనిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది.
 
వృశ్చికం :- బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను తెచ్చుకోకండి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. ఖర్చులు అధికం.
 
ధనస్సు :- మీ అభిరుచి ఆశయాలకు తగినవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, మెకానికల్ రంగాలలో వారికి అభివృద్ధి కానరాగలదు. స్త్రీలతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు.
 
మకరం :- ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సహకరంగా ఉంటుంది. మిమ్మల్ని హేళన చేసేవారు మీ సహాయాన్ని అర్థిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభించగలదు.
 
కుంభం :- ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేయడం మంచిది కాదు అని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. దంపతుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి, విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
మీనం :- ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. అనాలోచిత నిర్ణయాలు తగవు. స్థిరాస్తి కొనుగోలు, లేదా అమ్మకానికై చేయు ప్రయాత్నాలు వాయిదా పడతాయి. బ్యాంకు పనులు మందకొడిగాసాగుతాయి. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. అందరినీ అతిగా నమ్యే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది.