గురువారం, 27 జూన్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-06-2024 బుధవారం దినఫలాలు - విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సత్ఫలితాలు...

astro2
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ బ|| చతుర్ధశి రా.7.24 కృత్తికరా.9.12 ఉ.వ.9.41 ల 11.13. ప.దు. 11.31 ల 12.23.
 
మేషం :- ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగంలోని వారికి ఒత్తిడి తప్పదు. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలటంతో పొదుపుసాధ్యం కాదు. వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతోముఖ్యం. 
 
వృషభం :- రాజకీయ, రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. విద్యా సంస్థలలోనివారికి ఒత్తిడి, పెరుగుతుంది. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సత్ఫలితాలు లభిస్తాయి.
 
మిథునం :- మీ ప్రియతముల పట్ల, ముఖ్యల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. స్థిరాస్తి అమ్మకం వాయిదావేయడం మంచిది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి లభిస్తుంది. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి.
 
కర్కాటకం :- మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
సింహం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పనిచేసే చోట కించెత్ లోపాన్ని చూపించి ఎదుటి వారు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు చేస్తారు.
 
కన్య :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రయాణాలలో అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. పారిశ్రమిక రంగాల వారికి ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. ఇతరుల గురించి సంభాషించేటపుడు ముందు వెనుకలు గమనించండి.
 
తుల :- దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు అధికమవుతాయి. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లోవారికి ఆందోళన తప్పదు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సోదరీ, సోదరులమధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.
 
వృశ్చికం :- అర్థాంతంగా నిలిపివేసిన గృహ మరమ్మతులు, పనులు పునఃప్రారంభిస్తారు. మీ మాటలు ఇతరులకు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలకు ఆలయ సందర్శనాలలో చికాకులుతప్పవు.
 
ధనస్సు :- చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. స్త్రీలు ఆత్మీయులతో పరస్పరం కానుక లిచ్చిపుచ్చుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపం, పట్టింపులు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణల కోసం చేసే యత్నాలు క్రమంగా సత్ఫలితాలనిస్తాయి. రచన, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం.
 
మకరం :- దృఢ సంకల్పం ద్వారా అన్ని కష్టాలను అధిగమిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి, చికాకులు అధికం. బంధువుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. దైవదర్శనాల్లో అసౌకర్యానికి లోనవుతారు. క్రీడ, కళాకారులు బాగా రాణిస్తారు.
 
కుంభం :- సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మొహమ్మాటాలకు పోయి దుబారా ఖర్చులు చేయకండి. ఉన్నతస్థాయి అధికారులు ధనప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీలు వాహనం నడుపుతున్నపుడు, నగదు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
 
మీనం :- పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయాలో జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. ప్రైవేట్ విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులౌతారు.