సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (07:00 IST)

04-06-2024 మంగళవారం దినఫలాలు - ఉద్యోగస్తులకు ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీలు...

horoscope
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ ఐ|| త్రయోదశి రా.9.09 భరణి రా.10.10 ఉ.వ.8.32 ల 10.02, ఉ.దు. 8.03 ల 8.55, రా. దు. 10.51 ల 11.35.
 
మేషం :- వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన స్కీములు మంచి ఫలితాలిస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. కోర్టు వ్యవహరాలు, భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. మీ శ్రీమతి, సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. ఉద్యోగస్తులకు పని భారం అధికం. జాయింట్ వెంచర్లు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. 
 
వృషభం :- బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెళకువ వహించండి. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణం మంచిది కాదు. దుబారా ఖర్చులు నివారించగలుగుతారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన స్కీములు మంచి ఫలితాలిస్తాయి. 
 
మిథునం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు త్వరలో ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ కాగలవు. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. కొబ్బరి, పండ్లు, హోటల్, చల్లని పానీయ, తినుబండారు వ్యాపారులకు లాభం.
 
కర్కాటకం :- వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చేతివృత్తుల వారికి అవకాశాలు లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.
 
సింహం :- ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. అకాలభోజనం, శ్రమాధిక్యతల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విందు, వినోదాల కోసం అధికంగా ధనం వ్యయం చేస్తారు. ఎలక్ట్రానిక్, ఏసీ రంగాల్లో వారికి కలిసి రాగలదు. కోర్టు వ్యవహారాల్లో సంతృప్తి కానరాదు. అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
 
కన్య :- దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పాత వస్తువులనుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెళకువ వహించండి. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి.
 
తుల :- పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ఓర్పు, శ్రమాధి క్యతతో అనుకున్నకార్యాలు నెరవేరగలవు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఆకస్మిక ఖర్చులవల్ల ధనం చేతిలో నిలబడటం కష్టం.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, ప్రమోషన్ వంటి శుభ పరిణామాలుంటాయి. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. పొదుపు దిశగా మీ యత్నాలు కొనసాగిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. పెద్దల ఆరోగ్యములో అధికమైన జాగ్రత్తలు అసవరం.
 
ధనస్సు :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. బంధు మిత్రులు మిమ్ములను గురించి అపోహపడే ఆస్కారం ఉంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
మకరం :- శాస్త్ర, సాంకేతిక, కళ, క్రీడా రంగాల వారికి ఆశాజనకం. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
కుంభం :- సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, నగదు అవార్డు వంటి శుభ సంకేతాలున్నాయి. స్త్రీలకు అయిన వారి నుంచి ఆదరణ లభిస్తుంది. వస్త్ర, బంగారం, వెండి, రత్న వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. 
 
మీనం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీ రుణదాతల నుండి ఒత్తిడి అధికమువుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు చేయుటలో విజయం సాధించగలుగుతారు. కళత్ర వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. గృహోపకరణాలను అమర్చుకోవటంలో మునిగిపోతారు.