1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-06-202 శనివారం దినఫలాలు - మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం...

astro3
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ విదియ సా.4.26 ఆరుద్ర రా.8.40 ఉ.శే.వ. 6.31కు ఉ.దు. 5.28 ల 7.11.
 
మేషం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. షేర్ల అమ్మకం కంటె కొనుగోళ్ళే లాభదాయకం. ఏదన్నా అమ్మకానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. హోటల్, తినుబండారాల వ్యాపారులకు కలిసిరాగలదు. బ్యాంకింగ్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు.
 
వృషభం :- ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వారికి శుభదాయకం. మీ పథకాలు, ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చగలవు. విద్యార్థులు ఇతరుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రుణం తీర్చటానికై చేయుయత్నాలు వాయిదా పడతాయి.
 
మిథునం :- వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాభివృద్ధి కానవచ్చిన, పనివారితో చికాకులు తప్పవు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు. మీ పాత సమస్య ఒకటి పరిష్కారం కావటంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఐరన్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాలలో ఆశించినంత సంతృప్తి కానరాదు. సంఘంలో నూతన వ్యక్తుల పరిచయం మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది. మధ్య వర్తిత్వం వహించంటం వల్ల గుర్తింపు లభిస్తుంది. ఇతరుల కిచ్చినమాట నిలుపుకునే యత్నంలో శ్రమ, ప్రయాసలు ఎదుర్కుంటారు. స్త్రీల తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు తప్పవు. 
 
సింహం :- ఏ.సి., ఇన్వెర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకం.
 
కన్య :- ముఖ్యులతో అత్యంత సన్నిహితంగా మెలగటం వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అవివాహితులలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల రాకపోకలతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి.
 
తుల :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీ ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు జాగ్రత్త వహించండి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి.
 
వృశ్చికం :- ఉద్యోగస్తుల శ్రమకు తగిన ప్రతిఫలం, ప్రోత్సాహం లభిస్తాయి. తలపెట్టిన పనిలో కొంతముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. స్త్రీలకు రచనలు, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు :- మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెలకువ అవసరం. ఎన్ని అవరోధాలు తలెత్తిన వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.
 
మకరం :- విద్యార్ధుల ఆలోచనలు పక్కదారి పట్టకుండా మెలకువతో వ్యవహరించవలసి ఉంటుంది. ప్రేమానుబంధాలు, సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి అనుకున్న పనుల్లో ఆటంకాలు తప్పవు. ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా మీరు చేసిన సహాయానికి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కుంభం:- బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. కీలకమైన చర్చలు, ఒప్పందాల విషయంలో మెళకువ వహించండి. ఉద్యోగస్తులకు అధికారులతో పరస్పర అవగాహన కుదరదు. మీ యత్నాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకేయండి. నిరుద్యోగులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు.
 
మీనం :- బంధువర్గాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ఇతరుల కారణంగా భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు త్వరలోనే ఒక మంచి అవకాశం లభించే ఆస్కారం ఉంది.