గురువారం, 31 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-07-2024 బుధవారం దినఫలాలు - సోదరులు మీతో అన్ని విషయాల్లోను ఏకీభవిస్తారు....

horoscope
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ చవితి పూర్తి ఆశ్రేష ఉ.7.51 రా.వ.8.50 ల 10.34. ఉదు. 8.09ల 9.01 రా.దు. 10. 57 ల 11.41.
 
మేషం :- ఐరన్, సిమెంట్, కలప రంగాలలోని వారికి నిరుత్సాహం తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారులను నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధు మిత్రుల రాకతో నూతన ఉత్సాహం కానవస్తుంది. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
వృషభం :- బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. వాహనయోగం వంటి శుభ ఫలితాలు పొందుతారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వైద్యులకు అభివృద్ధి కానరాగలదు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం.
 
మిథునం :- వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడతారు. స్నేహ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కార్మికులకు, పారిశ్రామికులకు పరస్పర అవగాహన కుదురుతుంది. బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
కర్కాటకం :- భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏకాగ్రతతో కృషి చేసిన మీ ఆశయం తప్పక నెరవేరుతుంది. పాత రుణాలు తీరుస్తారు.
 
సింహం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సినీరంగ పరిశ్రమల్లోవారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
కన్య :- రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురవుతారు. సోదరులు మీతో అన్ని విషయాల్లోను ఏకీభవిస్తారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. కళలు, సాంస్కృతిక రంగాలు, విద్య, న్యాయరంగాల వారు ఈ రోజు కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు.
 
తుల :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. మీ అంచనాలు తలక్రిందులయ్యే అవకాశం ఉంది. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. చిన్నారులు, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. కాలక్షేపాల ద్వారా ఊరట పొందుతారు.
 
వృశ్చికం :- హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఇంటి పనులలో నిమగ్నం అవుతారు. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్థులకు పై అధికారులు వల్ల ఒత్తిడి, చికాకులు తప్పవు. పెన్షన్, భీమా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.
 
ధనస్సు :- ఉపాధ్యాయ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సామూహిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. ఉద్యోగస్థులు ఊహించని అవరోధాలు తలెత్తుతాయి. ఎప్పటినుంచో కలవాలనుకున్న ఆత్మీయులను కలిసే అవకాశం ఉంది.
 
మకరం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలసివస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. ముఖ్యల కోసం షాపింగులు చేస్తారు. దైవస్మరణ వలన మనశ్శాంతి కలుగుతుంది. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు.
 
కుంభం :- టెక్నికల్, సాంకేతిక రంగాలలో వారికి లాభదాయకం. ఆలయాలను సందర్శిస్తారు. సోదరి సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి రాగలవు. పదవులు, సభ్యత్వాలకు స్వస్తి చెబుతారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు ఆశాజనకం.
 
మీనం :- కిరాణా రంగంలోని వారికి శుభదాయకం. వ్యాపార విషయముల యందు జాయింట్ సమస్యలు రావచ్చును. ఇతర దేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాల్లో మిత్రులు మిమ్మల్ని శంకించేందుకు ఆస్కారం ఉంది. మెళుకువ వహించండి. రాజకీయరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.