బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-07-2024 శుక్రవారం రాశిఫలాలు - పాత మిత్రుల సహకారం లభిస్తుంది...

horoscope
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట ఐ॥ అమావాస్య తె.3.59 ఆరుద్ర తె.4.31 ప.వ.12.48ల 2.25. ఉ.దు. 8.09 ల 9.01 ప. దు. 12. 30 ల 1.22.
 
మేషం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ వహించండి. ప్రైవేటు సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. సాహస ప్రయత్నాలు విరమించండి. కుటుంబీకుల మద్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
వృషభం :- ప్రలోభాలకు లొంగవద్దు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఉండదు. పాత మిత్రుల సహకారం లభిస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయనాయకులు విదేశీపర్యటనలలో మెళుకువ అవసరం. ప్రయాణాలు, తీర్థయాత్రలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
మిథునం :- ఉద్యోగస్తులు అధికారులను మెప్పించటానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. దూర దేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుంచి అవమానాలు తప్పవు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయాజనాలు సాధించడం కష్టసాధ్యం. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేయవలసివస్తుంది.
 
కర్కాటకం :- చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ వ్యవహారంలోను ఇతరులపై అతిగా ఆధారపడటం మంచిది కాదు.
 
సింహం :- చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెళుకువ వహించండి. బంధు మిత్రుల కలయికతో నూతన ఉత్సాహం కానవస్తుంది. దంపతుల మధ్య చిన్నచిన్న కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు పై అధికారులను నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కన్య :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కివస్తాయి. విదేశీయానం, రుణ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి.
 
తుల :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
వృశ్చికం :- వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రతముఖ్యం. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు :- తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రముఖులకు కానుకలు సమర్పించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహరాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
మకరం :- వ్యవసాయ, తోటల రంగాల వారికి రుణాలు మంజూరు కాగలవు. ఎదుటివారి మాటలను తేలికగా తీసుకోవటం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.
 
కుంభం :- మీ సంతానం విద్యా విషయాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. వాగ్విదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కొందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
మీనం :- కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రిప్రజెంటెటివులకు మార్పులకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేతివృత్తుల వారికి కలిసిరాగలదు. విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది.