బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-07-202 సోమవారం రాశిఫలాలు - బంధు మిత్రులతో సంతోషంగా ఉండాలి...

Astrology
శ్రీ క్రోధినామ సం II జ్యేష్ట బ II దశమి ఉ.11.00 అశ్వని ఉ.7.38 సా.వ. 4.41 ల 6.12. ప. దు. 12.29 ల 1.21 పు.దు. 3.05 ల 3.57. 
 
మేషం :- ఉద్యోగ, వ్యాపారాలలో బాగుగా రాణిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయనాయకులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆరోగ్యంలో చిన్నచిన్న సమస్యలను ఎదుర్కొంటారు. న్యాయసంబంధిత వివాదాల్లో విజయం సాధిస్తారు.
 
వృషభం :- బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్నిసార్లు మౌనమే సమాధానం. ముఖ్యమైన విషయాలలో పెద్దల సహాయ సహకారాలు ఎంతో అవసరం. విద్యార్థులకు అవకాశాలు కలిసివస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. నిర్ణయాలల్లో స్థిరత్వం ఉండేలా చూసుకోండి. 
 
మిథునం :- ఉద్యోగపరంగా అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. రుణభారం పెరగకుండా చూసుకోండి. పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని వీడండి. శత్రువులపై జయం చేకూరుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
కర్కాటకం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. పట్టుదలతో, శ్రమతో లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చేపట్టిన పనిలో ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధు మిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికం.
 
సింహం :- ఉద్యోగంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఆత్మీయులతో విభేధాలు రాకుండా జాగ్రత్త పడండి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రులను కలుసుకుంటారు. 
 
కన్య :- ఆర్థిక సమస్యలు తొలగి కుదుటపడతారు. ఉద్యోగస్తులకు అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త అవసరం. పెద్దలకు ఆహార వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిత్రుల సహకారం వల్ల మీకు మంచి జరుగుతుంది.
 
తుల :- చీటికిమాటికి చిరాకుపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు అధికమవుతాయి. ప్రైవేట్ సంస్థలవారికి ఓర్పు ప్రధానం. మిత్రులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉత్సాహంతో ముందుకు సాగి జయం పొందండి.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. దంపతుల మధ్య అకారణంగా కలహాలు తలెత్తుతాయి. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
ధనస్సు :- బ్యాంకు వ్యవహరాల్లో అపరిచిత వ్యక్తలపట్ల ఏకాగ్రత వహించండి. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. స్త్రీలకు ప్రకటనలు, స్కీంల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ఖర్చుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
మకరం :- కుటుంబంలో స్పర్థలు, చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో మెళుకువ అవసరం.
 
కుంభం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఏ విషయంలోను ఒంటెద్దు పోకడ మంచిది కాదు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళుకువ అవసరం. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు.
 
మీనం :- బంగారం వ్యాపారులు, పనివారలకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది.